ఇండియా మోస్ట్ వాంటెడ్  అమృతపాల్ సింగ్ ఎలా చిక్కాడు..?

ఇండియా మోస్ట్ వాంటెడ్ అమృతపాల్ సింగ్ ఎలా చిక్కాడు..?

ఇండియా మోస్ట్ వాంటెడ్ పర్సన్ మరియు ఖలిస్థానీ వేర్పాటువాద నేత అమృతపాల్ సింగ్ అరెస్టుతో.. కొంత కాలంగా ఆయన కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌కు ముగింపు పడింది. అమృతపాల్ సింగ్ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న తరుణంలో.. ఆయన అనూహ్యంగా పోలీసులకు చిక్కటం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్‌లోని “మోగా” జిల్లాలో అమృతపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తరువాత అస్సోంలోని “డిబ్రూగడ్” జైలుకు తరలించారు. తన అరెస్టుకు ముందు “రోడే” గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృతపాల్ ప్రసంగించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. “రోడే” గ్రామం ఖలిస్థాన్ ఉగ్రవాది “బింద్రన్ వాలే” స్వగ్రామం కావటం విశేషం. ఇక.. అమృతపాల్ సింగ్‌పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ను మోపిన పోలీసులు.. అసోంలోని “డిబ్రూగడ్” జైలుకు తరలించారు. దీంతో.. అమృతపాల్ సింగ్ కోసం జరుగుతన్న సెర్చ్ ఆపరేషన్‌కు తెరపడినట్టైంది. అయితే… ఇకపై ఖలిస్థాన్ వేర్పాటు వాదుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేకిత్తిస్తోంది. మరోవైపు.. అమృతపాల్ సింగ్‌ తరలింపుతో అసోంలోని “డిబ్రూగడ్” జైలు చర్చనీయాంశంగా మారింది.

అమృతపాల్ సింగ్.. పొట్టచేత పట్టుకుని దుబాయ్ వలస వెళ్ళిన ఈ పంజాబీ యువకుడు అనూహ్యంగా ఇప్పుడు ఖలిస్థానీ వేర్పాటు వాదులకు ఆరాధ్య నాయకుడిగా అవతరించాడు. భారత వ్యతిరేక విధ్వేషాలను రెచ్చగొడుతూ ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరాడు. అతడిని “అభినవ బింద్రన్ వాలేగా” కొంత మంది అభివర్ణిస్తున్నారంటే.. అమృత‌పాల్ సింగ్‌లో మతోన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్ఢం చేసుకోవచ్చు. సోషల్ మీడియా పుణ్యమా అని దుబాయ్ కార్మికుడిగా వెళ్లిన అమృతపాల్ అనతి కాలంలోనే ఖలిస్థానీ వేర్పాటువాదిగా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. ‘వారిస్ పంజాబ్ దే” అనే సంస్థను ఏర్పాటు చేసి పంజాబీ యువతను ఖలిస్థానీ వేర్పాటు ఉద్యమం వైపు నడిపించటానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే పంజాబ్ లో సిక్కు యువతను రెచ్చగొట్టటం.. దేశ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడటం.. పాకిస్థానీ ఉగ్రవాదులతో చేతులు కలపటం వంటి ఎన్నో చర్యలకు అతను ఒడిగట్టాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను సైతం విడిపించుకుని వెళ్ళే స్థాయికి అమృతపాల్ చేరటంతో.. భారత ప్రభుత్వం అలర్టైంది. అతడి కోసం వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత మార్చి 18 నుంచి అజ్ణాతంలోకి వెళ్ళి పోయిన అమృతపాల్ సింగ్ కోసం.. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసు వేట కొనసాగుతోంది. అయితే.. అనూహ్యంగా అతను పంజాబ్‌లోనే పోలీసులకు చిక్కటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక.. భింద్రాన్‌వాలే తో ఖలిస్తాన్ శకం పూర్తిగా ముగిసిందని భావిస్తున్న తరుణంలో దుబాయి నుండి తిరిగి వచ్చిన అమృతపాల్ అనూహ్యంగా భింద్రాన్‌వాలే–2గా అవతారమెత్తడంతో యావత్తు దేశం అవాక్కయింది. ఎప్పుడో అంతమైన ఖలిస్థాన్ ఉద్యమం అమృతపాల్ సింగ్ నేతృత్వంలో మళ్లీ మొదలౌతుందా..? అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తం అయ్యింది. అయితే.. సుమారు నెల రోజుల వేట తరువాత అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అసోంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న “డిబ్రూగడ్” జైలుకు తరలించారు. అతను ఇప్పట్లో బయటకు రాకుండా.. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌‌తో సహా దేశభద్రతకు సంబంధించి 16 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు.. అమృతపాల్ సింగ్ కు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు. అలాగే అతని బృందంలో ఎవరెవరు ఉన్నారు…? పాకిస్థాన్ ఐఎస్ఐ తో వారికి ఉన్న సంబంధాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు, నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పంజాబ్‌లో అరెస్టైన అమృతపాల్ సింగ్ ను ఈశాన్య భారతదేశంలోని అసోం రాష్ట్రానికి తరలించటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న డిబ్రూగడ్ జైల్లో అమృతపాల్ సింగ్‌ను ఉంచారు. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్‌లో అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు ఆయుధాలతో వచ్చిన ఆందోళనలు చేశారు. కానీ, అస్సాం వచ్చి అలా చేయడం అంత తేలికైన విషయం కాదనే భావనకు వచ్చిన పోలీసులు… డిబ్రూగడ్ జైలును ఎంచుకున్నారు. అంతేకాదు.. డిబ్రూగఢ్ జైలులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. రైలు, విమానంలో డిబ్రూగఢ్ చేరుకోవడం చాలా కష్టసాధ్యం. దీంతో పాటు డిబ్రూగఢ్ జైలులో ఎలాంటి గూండాయిజం చేయడానికి వీలుండదు. ప్రత్యేక సెల్‌లో అమృతపాల్‌ను ఉంచుతున్నారు. ఈ జైలులో భాష కూడా ఒక పెద్ద సమస్య. హిందీ, పంజాబీ వచ్చిన వారు జైల్లో లేకపోవటంతో.. అమృతపాల్ సింగ్ జైలు లోపల ఏం చేయడానికి వీలుండదని అధికారులు అంటున్నారు. ఇక.. ఈశాన్య భారతంలో అత్యంత పాత జైళ్లలో ఒకటైన డిబ్రూగఢ్ జైలు గుర్తింపు పొందింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు.. ఈ జైలును నిర్మించారు. 1859-60 నిర్మించిన ఈ జైలు.. తాజాగా అమృతపాల్ సింగ్ రాకతో జాతీయ స్థాయి మీడియా దృష్టిని ఆకట్టుకుంటోంది.

మరో వైపు.. అమృతపాల్ సింగ్ అరెస్టుపై భిన్న కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తనంతట తానే లొంగిపోయాడని కొందరు అంటుండగా.. తన భార్యను అరెస్టు చేస్తారనే భయంతోనే అతను లొంగిపోయాడని మరికొంత మంది అంటున్నారు. ఇటీవల లండన్ వెళ్ళిపోవటానికి ప్రయత్నించిన అమృతపాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను భద్రతా బలగాలు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నాయి. దీంతో… ఆమె అరెస్టు అయితే.. మరింతగా ఇబ్బందులు వస్తాయని భావించిన అతను వ్యూహాత్మకంగానే పోలీసులకు సరెండర్ అయినట్టు చెబుతున్నారు. మొత్తం మీద గత కొంత కాలంగా ఖళిస్థాన్ ఉద్యమం పేరిట నడుస్తున్న హైడ్రామాకు అమృతపాల్ సింగ్ అరెస్టుతో తెరపడిందనే చెప్పాలి. అయితే.. ప్రస్తుతం అసోంలోని “డిబ్రూగడ్” జైల్లో ఉన్న అమృతపాల్ సింగ్ సైలెంట్‌గా ఉంటాడా…? లేక జైలు నుంచే తన వేర్పాటు వాద వ్యూహాలను అమలు చేస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

 

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

ఫొటోస్ : రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *