
షాలిని డైవర్స్ ఫోటో షూట్ వెనుక అసలు కథ అదేనా..?
- News
- May 3, 2023
- No Comment
- 32
పెళ్ళి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటారు. అలాంటి వారిలో తమిళ బుల్లితెర నటి, ఫ్యాషన్ డిజైనర్ షాలిని ఒకరు. పలు సీరియల్స్‌లో నటించిన ఆమె తమిళనాట పాపులర్ అయ్యారు. అయితే.. ఆమె తాజాగా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
ఈ విడాకులు మంజూరు కావడంతో షాలిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేక్ కట్‌చేసి మరీ పండుగ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ మాదిరిగా.. ఈ విడాకులకు సంబంధించి కూడా ఆమె ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
సీరియల్ యాక్టరైన.. షాలినికి 2020లో వివాహం అయ్యింది. ఆమె భర్త పేరు రియాజ్. వీళ్ళకు ఓ పాప కూడా ఉంది. మూడేళ్ళ వైవాహిక జీవితం అనంతరం ఇద్దరూ వేరు పడాలని నిర్ణయించుకున్నారు. డివోర్స్ తీసుకున్నారు. అయితే, విడాకులను షాలిని వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి ఫోటోను చింపేస్తూ… ఫోటో షూట్ చేశారు. అది వైరల్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే… ఈమె ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి.
జీవితంలో ”సంతోషంగా ఉండటం ముఖ్యం… అందుకని, బ్యాడ్ మ్యారేజ్ నుంచి వైదొలగడం తప్పేమీ కాదు. విడాకుల తీసుకోవడం ఫెయిల్యూర్ ఏమీ కాదు. జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్. మన జీవితంలో సానుకూల మార్పులకు మొదలు. వైవాహిక బంధం నుంచి బయటకు రావడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యవంతులైన మహిళలందరికీ నేను ఈ ఫోటో షూట్ అంకితం ఇస్తున్నా” అని షాలిని పేర్కొన్నారు.
ఫోటో షూట్ వైరల్ కావడంతోసోషల్ మీడియాలో షాలిని మరో పోస్ట్ చేశారు. తన ఫోటో షూట్ మీద ఆసక్తి చూపించిన వారందరికీ థాంక్స్ చెప్పారు. తన లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న మహిళలు అందరికీ సందేశం ఇవ్వడం కోసమే ఆ ఫోటో షూట్ అని పేర్కొన్నారు. మొత్తం మీద.. సీరియల్ యాక్టర్ షాలినీ పోస్ట్ చేసిన డైవర్స్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.