జైపూర్ లో హీరో శర్వానంద్ పెళ్లి వేడుక

జైపూర్ లో హీరో శర్వానంద్ పెళ్లి వేడుక

హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రక్షితను పెళ్లాడబోతున్నాడు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా,రక్షితల వివాహ వేడుకలు మొదలయ్యాయి.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సాయంత్రం  మెహందీ అండ్ కాక్‌టైల్ వేడుక నిర్వహించారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.శనివారం ఉదయం 11:30 గంటలకు శర్వాని పెళ్లికొడుకు చేసే కార్యక్రమం ఘనంగా జరగనుంది.  రాత్రి 11 గంటలకు శర్వా, రక్షితతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో  హాజరుకానున్నారు.

ఈ ఏడాది జనవరి 26న శర్వానంద్ , రక్షితల నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ, శర్వానంద్  సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. శర్వా వెడ్డింగ్ కార్డును చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు. కాగా,  రక్షిత మాజీ మంత్రి టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు. ఆమె తండ్రి హైకోర్టు లాయర్.

ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్‌.. శ్రీరామ్‌ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. రెగ్యులర్‌ షూట్‌ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో బిజీ అయిపోయారు శర్వానంద్.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *