పాము విషం రూ.13 కోట్లా..? కాసులు కురిపిస్తున్న “విష” వ్యాపారం

పాము విషం రూ.13 కోట్లా..? కాసులు కురిపిస్తున్న “విష” వ్యాపారం

  • News
  • May 3, 2023
  • No Comment
  • 27

పాము విషంతో ఏటా వందల కోట్ల వ్యాపారం
వెస్ట్ బెంగాల్ బోర్డర్‌లో రూ.70 కోటల విషం సీజ్
తాజాగా పట్టుబడ్డ మరో రూ.13 కోట్ల పాము విషం

గ్రాఫిక్స్2:
ఏటా 5.4 మిలియన్ల మందికి పాముకాటు
సుమారు 81 వేల నుంచి 1.38 లక్షల మరణాలు
పాము కాటు వల్ల చికిత్స అందక ఎక్కువ మరణాలు
యాంటీ వెనిమ్ ఇంజక్షన్లకు పాము విషమే ఆధారం
ప్రపంచ వ్యాప్తంగా పాము విషానికి భారీ డిమాండ్

గ్రాఫిక్స్3:
కొన్ని రకాల మందుల్లో సైతం పాము విషం వినియోగం
అటవీ ప్రాంతాల్లో 10 గ్రా పాము విషం ధర రూ.4 వేలు
వ్యాపారులకు రూ.50 వేల వరకు విక్రయిస్తున్న దళారులు
అంతర్జాతీయ మార్కెట్లలో కోట్లు పలుకుతున్న పాము విషం

గ్రాఫిక్స్4:
ఇండియా-బంగ్లాదేశ్ బోర్డర్‌లో పట్టుబడ్డ పాము విషం
రూ.13 కోట్ల విలువైన కింగ్ కోబ్రా విషం స్వాధీనం
……………
మనలో చాలా మందికి పాము కనిపిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి… దాన్ని చూడగానే కిలోమీటర్ దూరం పరిగెడతారు. ఇంకొంత మంది అయితే ఏ కర్రో..రాయో పట్టుకుని దాని అంతు చూడందే నిద్రపోరు. అలాగే.. పాము కాటుకు బలౌతున్నవారి సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. కానీ.. వీటన్నింటినీ కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు పాములు కోట్లు కురిపిస్తున్నాయి. వాటి విషం వందల కోట్ల రూపాయల రేటు పలుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం పాము విషంపై జరుగుతోందంటే నమ్మగలరా..? ఎక్కడి దాకానో ఎందుకు..

మన వెస్ట్ బెంగాల్ బోర్డర్‌లో ఈ మధ్య కాలంలోనే అక్రమంగా తరలిస్తున్న 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన పాము విషాన్ని అధికారులు పట్టుకున్నారు. తాజాగా 13 కోట్ల రూపాయల విలువైన విషాన్నీ సీజ్ చేశారు. దీంతో పాము విషం స్మగ్లింగ్ వ్యహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ పాము విషం ఎందుకు స్మగ్లింగ్ అవుతోంది.. దానికంత విలువ ఎలా వచ్చింది..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వేలాది మంది పాము కాటుకు గురౌతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏడాదికి 5.4 మిలియన్ల మంది పాము కాటుకు గురౌతుండగా… వారిలో సుమారు 81 వేల నుంచి 1.38 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది సకాలంలో యాంటీ వెనిమ్ ఇంజక్షన్ దొరక్క పోవటం వల్లే చనిపోతున్నారు. సో.. దీనిని బట్టే యాంటీ వెనిమ్ ఇంజక్షన్లకు ఎంత డిమాండ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

పాము కాటు నుంచి మనుషుల ప్రాణాలు కాపాడే ఈ యాంటీ వెనిమ్ ఇంజక్షన్లను.. పాము విషం నుంచే తయారు చేస్తారు. మిల్లీ గ్రాము పాము విషాన్ని సైతం ఎంతో ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. ల్యాబరేటరీల్లో ప్రత్యేకమైన పరీక్షలు, పరిశోథనల అనంతరం.. యాంటీ వెనిమ్ ఇంజక్షన్లు తయారు చేస్తారు. ఇలా తయారైన వాటికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వాటి ముడి సరుకు అయిన విషానికి దానికన్నా ఐదారు రెట్లు డిమాండ్ ఉందని తెలుస్తోంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో పాము విషం స్మగ్లింగ్.. యధేచ్ఛగా సాగిపోతోంది.

కేవలం యాంటీ వెనిమ్ ఇంజక్షన్ల తయారీలోనే కాదు..ప్రాణాలను కాపాడే అనేక ఔషధాల తయారీలో కూడా పాము విషాన్నివినియోగిస్తుంటారు. ఆయుర్వేద విధానంలో కూడా పాము విషంతో తయారైన ఔషధాలు వాడతారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే నాగుపాము, రక్త పింజర, కట్లపాము, కింగ్ కోబ్రా వంటి పాముల నుంచి విషాన్ని దళారులు సేకరిస్తుంటారు.

అటవీ ప్రాంతాల్లో నాగుపాము విషం 10 గ్రాములకు 4 వేలు చెల్లిస్తున్నారు. వారినుంచి సేకరించిన దళారులు.. 50 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో సేకరించిన విషాన్ని.. బడా ముఠాలు అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నాయి.

తాజాగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్న పాము విషాన్ని బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని పమన్‌పరా గ్రామంలో స్మగ్లర్లు పారిపోతూ పాము విషంతో నింపిన గాజు జార్‌ను జారవిడిచారు. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాపై ‘మేడిన్ ఫ్రాన్స్’ అని రాసి ఉన్నట్టు తెలిపారు. ఆ విషం కోబ్రాదని, దాని విలువ 13 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న విషపు సీసాను అటవీ అధికారులకు అందించారు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి స్మగ్లింగ్ అవుతున్న సుమారు 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. మన సరిహద్దుల్లో సైతం పాము విషం స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ప్రాణాలు తీసే పాము విషం నుంచి కూడా అంతర్జాతీయంగా వేల కోట్ల రూపాయల వ్యాపరం జరుగుతోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *