
టాలీవుడ్ లో టాప్ హీరోలతో శ్రీలీల..ఒకేసారి 9 సినిమాలు
- EntertainmentMoviesNews
- May 6, 2023
- No Comment
- 37
కన్నడ బ్యూటీ శ్రీలీల ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. టాప్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తోంది. పెళ్లిసందడి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక, ధమాకా సూపర్ హిట్ తర్వాత తన రేంజ్ మారిపోయింది. చేతినిండా సినిమా ఆఫర్లతో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
శ్రీలీల చేతిలో ఇప్పుడు తొమ్మిది సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద సినిమాలే కావడం విశేషం. మూడు సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా…ఎస్ఎస్ఎంబీ28, ఉస్తాద్ భగత్‌సింగ్, వైష్ణవ్ తేజ్ మూవీ, నితిన్ 32, అనగనగా ఒక రాజు, జూనియర్ మూవీలతోపాటు బోయపాటి శ్రీను, బాలకృష్ణ మూవీ ఎన్‌బీకే108లోనూ నటించనుంది. శ్రీలీల ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా…పెద్ద పెద్ద ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి. ఒకేసారి 9 సినిమాల్లో నటించడమంటే మాటలు కాదు. ఎంతైనా శ్రీలీల లక్కీ గాళ్ అని అంతా పొగిడేస్తున్నారు.
మహేష్ బాబు హీరోగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో… SSMB28 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న సినిమాలో శ్రీలీల నటించనుంది. ఇక, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల కథానాయకగా నటిస్తోంది.బాలకృష్ణ , అనిల్ రావిపూడి ల కలయిక లో వస్తున్న NBK-108 సినిమాలో బాలయ్యబాబు చెల్లెలిగా నటిస్తోంది శ్రీలీల.
మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ఠమూవీస్ లో వస్తున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలోనూ శ్రీలీల లీడ్ రోల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాలోనూ శ్రీ లీల నటిస్తున్నారు.నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న అనగనగా ఒకరాజు సినిమాలో శ్రీలీలే హీరోయిన్. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు నటిస్తున్న జూనియర్ లోనూ శ్రీలల నటిస్తోంది.