శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఓవరాక్షన్

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఓవరాక్షన్

వివాదాలకు కేరాఫ్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్. ఆమె ఎక్కడుంటే అక్కడ వీరంగం సృష్టిస్తుంటారు. ప్రజాప్రతినిథులంటే లెక్కేలేదు. అట్టడుగు వర్గాలంటే చులకనభావం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు విరుచుకుపడిపోతుంటారు. చెంపలు వాయిస్తూ, తన్నుతూ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్.

ఏపీలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పోలీస్ వ్యవస్థకే కళంకితం తెస్తున్నారు. జిల్లాలో ఆ లేడీ పోలీస్ ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు ప్రజలను తన్ని ఈడ్చి పడేస్తున్నారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏకంగా విపక్ష నేతలపై చేయి చేసుకుంటున్నారు. గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న అంజూయాదవ్ మరోసారి రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ పై సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సందర్భంగా అంజూయాదవ్ ఓ జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నారు. రెండు సార్లు చెంప చెల్లుమనిపించారు. సీఐ తీరుపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. తమ కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐ తీరు పట్ల పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తిలో సీఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంజూ యాదవ్‌ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అడిగినంత సొమ్ము చెల్లించనందుకు గతంలో ఒకరిపై మద్యం విక్రయిస్తున్నట్లుగా కేసు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అర్థరాత్రి ఓ మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపై దుస్తులు ఊడిపోతున్నా తన్నుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనపై పోలీస్‌ ఉన్నతాధికారులు ఏఎస్పీతో విచారణ చేయించారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నా ఇప్పటివరకు అంజూయాదవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీకే చెందిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు సైతం సీఐ ప్రవర్తనను తీవ్రంగా ఆక్షేపించినా చర్యలు లేవు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నట్లు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రతిపక్షాలు, స్థానికులపై శ్రీకాళహస్తి సీఐ తన ప్రతాపం చూపిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రతిపక్షాలు ఆందోళనకు అధికార పార్టీ కన్నా ఎక్కువగా బాధపడిపోతున్నారు. ఓ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి.. నోరు పారేసుకుంటున్నారు. చేయి కూడా చేసుకుంటున్నారు. గతంలోనూ శ్రీకాళహస్తి బస్టాండ్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే ముందస్తు అనుమతి లేదంటూ టీడీపీ కార్యకర్తను కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపైనా చేయి చేసుకున్నారు. వైసీపీ నేతలు తమపై దాడికి పాల్పడుతున్నారంటూ శ్రీకాళహస్తిలో టీడీపీ నేత సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గతంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వైసీపీ నేతలపై కేసు నమోదు చేయకుండా టీడీపీ శ్రేణులపై ఎదురుకేసులు పెట్టారు. ఆ సమయంలో అక్కడ లేని నేతలపైనా కేసులు బనాయించారు. ఇక, అమరావతి రైతులు పాదయాత్ర చేసే సమయంలోనూ…రహదారిపై నడుస్తుండగా పక్కకు జరగాలంటూ వారిని నెట్టివేశారు.

టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉషాపై కూడా అదే రీతిలో వ్యవహరించిన అంజూ యాదవ్ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. సత్యవేడు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించిన అంజు యాదవ్.. అదే పంథా కంటిన్యూ చేస్తూ వచ్చింది. 2009 నుంచి 2011 మధ్యకాలంలో తిరుపతి వెస్ట్ సీఐగా పనిచేస్తున్న సమయంలోనూ పోలీసు శాఖ సిబ్బందినే ఇబ్బంది పెట్టి శాఖా పరమైన విచారణ ఎదుర్కొంది. ఇక రేణిగుంట అర్బన్ సీఐగా పనిచేసిన సందర్భంలోనూ ఇదే రీతిలో వార్తల్లో నిలిచింది.

ఎన్ని ఆరోపణలొచ్చినా అధికార పార్టీ నేతల అండదండలతో అంజూయాదవ్ అక్కడే కొనసాగుతున్నారు. సీఐను సస్పెండ్ చేయాలని జనసేన సహా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *