
ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. సున్నా ఫలితాలు వచ్చిన స్కూళ్ళు ఎన్ని అంటే..?
- News
- May 6, 2023
- No Comment
- 23
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స చెప్పారు.
బాలురలో ఉత్తీర్ణ శాతం.. 69.27 శాతం, బాలికల్లో ఉత్తీర్ణత శాతం.. 75.38 శాతం ఉన్నట్టుగా తెలిపారు. 87.47 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా.. చివరి స్థానంలో నంద్యాల జిల్లా ఉన్నట్లు తెలిపారు. 933 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత.. 38 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చినట్టు తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత వచ్చిందని వివరించారు.
జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏప్రిల్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 13 వరకు గడువు ఉంటుందని తెలిపారు.