ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా?

ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా?

విశాఖలో సినిమాటిక్ రేంజ్ లో సాగిన అధికార వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కథా చిత్రం..సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఓ రౌడీ షీటర్…ఏకంగా ఎంపీ కుటుంబసభ్యులనే కిడ్నాప్ చేయడం షాకింగ్ కు గురిచేస్తే…రెండ్రోజుల పాటు ఆ గ్యాంగ్ బందీలుగా ఉంచారనే వార్త మరింత మిస్టరీగా మారింది. హేమంత్ అనే ఓ రౌడీ షీటర్ తన గ్యాంగ్ తో.. మంగళవారం రుషికొండలోని ఎంపీ కుమారుడున్న విల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. తొలుత ఎంపీ తనయుడిని, ఆ తర్వాత అతని ద్వారా తల్లిని, వారిద్దరి ద్వారా …. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఆడిటర్ జీవీని దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 48గంటల తర్వాత కిడ్నాప్ కథ సుఖాంతం కాగా ..  దాంట్లో చోటుచేసుకున్న ట్విస్టులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

మంగళవారం ఉదయం 8గంటల సమయంలో ఎంపీ కుమారుడి నివాసంలోకి హేమంత్ గ్యాంగ్ ప్రవేశించిందనేది పోలీసుల వర్షన్. బుధవారం ఎంపీ ఎంవీవీ తన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఏమాత్రం అనుమానం రాకుండా ఫోన్‌లో మాట్లాడటం సాధ్యమా? విల్లా వద్ద సెక్యూరిటీ గార్డు, పని మనుషులు ఏమయ్యారు? బుధవారం ఉదయం 7గంటలకు శరత్‌ చౌదరి ద్వారా తన తల్లి జ్యోతిని విల్లాకు రప్పించారని పోలీసులు చెబుతున్నారు. మరి… ఆమెను రుషికొండకు తీసుకెళ్లిన డ్రైవర్‌ మాటేమిటి? లోపలికి వెళ్లిన యజమాని ఎంతకూ బయటకు రానప్పుడు అనుమానం రాలేదా? ఆ తర్వాత ఆడిటర్ జీవీ తన డ్రైవర్‌ ద్వారా రెండు విడతల్లో రెండు కోట్లు తెప్పించినట్లు చెబుతున్నారు. తన యజమాని విల్లాలోకి వెళ్లి 24 గంటలు గడిచినా డ్రైవర్‌కు ఎలాంటి అనుమానం రాలేదా?ఇదంతా ఓ మిస్టరీలా ఉంది.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలోనే పేరుమోసిన బడా వ్యాపారస్థుడు. ఆయనకు వందల ఎకరాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. తన వద్ద పనిచేసిన హేమంత్ ను ఎంపీ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ కమీషన్ విషయంలో వచ్చిన తేడా కారణంగానే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారనేది ఆరోపణ. అయితే, ప్రతీరోజు భీమిలీ పీఎస్ లో సంతకం చేయాల్సిన హేమంత్.. రెండ్రోజుల పాటు రాలేనని చెప్పినట్లు సీపీ చెప్పారు. మరి, అప్పుడు రౌడీషీటర్ కదలికలను పోలీసులు ట్రాక్ చేయలేదా? కొద్ది రోజులకిందట ముఖ్యమంత్రి కూడా ఎంపీ విల్లాకు వెళ్లారు. అంటే, అక్కడ పటిష్ట ఏర్పాట్లు చేసి ఉంటారు. అలాంటి చోట 48 గంటలపాటు సాగిన హైటెన్షన్‌ డ్రామాను పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారు?అనేది అంతుచిక్కని రహస్యం.

కిడ్నాపర్లు తమ వాహనాన్ని ఢీకొట్టి… ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్‌ను శొంఠ్యాం జంక్షన్‌లో వదిలేశారని పోలీసులు చెబుతున్న మాట. ఆ తర్వాత వాళ్లు ఆటోలో వెళ్లిపోయారట. రెండ్రోజుల పాటు మద్యం, గంజాయి సేవిస్తూ దుండగులు వారిని కొట్టారని కూడా తెలుస్తోంది. అలాంటప్పుడు ప్రాణాలతో బయటపడ్డాక వారు ఎంపీకి సమాచారం ఇవ్వలేదా? అసలు హేమంత్‌తో ఎలాంటి సంబంధాలే లేవని ఎంపీ చెబుతుంటే…ఎంపీ చేసే నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టరు వద్ద హేమంత్‌ కొన్ని పనులు సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నాడని కమిషనర్‌ వెల్లడించారు. మరోవైపు… ఎంపీ కారు ముందు హేమంత్‌ తీసుకున్న ఫొటో కూడా బయటపడింది.

ఇంకో ట్విస్ట్ ఏంటంటే… హేమంత్ విజయసాయిరెడ్డి మనిషేనని స్థానికులు చెబుతున్నారు. సొంత పార్టీ నేతల మధ్య భూదందా వ్యవహారాల్లో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందా?అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఓ అధికార పార్టీ ఎంపీనే కిడ్నాపర్లు అరెస్ట్ చేశారన్న వార్త నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఎంపీ పరిస్థితే అలా ఉంటే, ఇక తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *