నంది అవార్డులపై పోసాని రచ్చ రచ్చ..అసలేం జరిగిందంటే?

నంది అవార్డులపై పోసాని రచ్చ రచ్చ..అసలేం జరిగిందంటే?

సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సీఎం జగన్ పంచన చేరాక పూర్తిగా మారిపోయారు. వైసీపీలో పోస్ట్ వచ్చాక, అతనిలోని పిచ్చి మరింత పీక్స్ కు వెళ్లిపోయింది. అన్నం పెట్టినన వారికి సున్నం పెట్టడమంటే పోసానినే బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలేమో. జగన్ ప్రాపకం కోసం జీవితాన్ని ఇచ్చిన కన్నతల్లి లాంటి సినీ ఇండస్ట్రీపై బురద జల్లుతున్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడం కోసం ఆఖరికి అవార్డులను కూడా హేళన చేసే స్థాయికి దిగజారారు.తెలుగునాట ఎప్పుడో మర్చిపోయిన నంది అవార్డుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు పోసాని. నంది అవార్డులను కమ్మ అవార్డులతో పోలుస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కృష్ణమురలి తీరును పలువురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సినీ పరిశ్రమకు కుల, మత, ప్రాంతం అనే భేదం ఉండదు. అందరూ కళామ్మతల్లి బిడ్డలుగానే మెలుగుతుంటారు. అలానే పోసాని కూడా ఇంతకాలం ఇండస్ట్రీలో ఆ గొడుగు కిందే బతికారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసిన పోసాని …ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా వచ్చాక స్వరం మార్చారు. జగన్ మెప్పు పొందడం కోసం ఇండస్ట్రీకి కులాన్ని ఆపాదిస్తూ, నంది అవార్డుల విషయాన్ని టీడీపీకి ముడిపెడుతూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2019 ఎన్నికల్లో జగన్ కు జై కొట్టిన పోసాని, ఆ తర్వాత పదవి రాలేదని కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఎందుకొచ్చిన గొడవ అని మూడున్నరేళ్లు దాటాక జగన్ పోసానిని పిలిపించి..ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అయితే, ఆ పదవిని అడ్డుపెట్టుకొని పోసాని సినీ పరిశ్రమకు కళంకితం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొందరు నిర్మాతలు మండిపడుతునన్నారు. పోసానికి భాష ఏవిధంగా ఉంటుందో గతంలో ఎన్నోసార్లు చూశాం. తన, మన అనే భేదం లేకుండా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతారో, పవన్ కల్యాణ్ విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు ఎంత దారుణంగా ఉందో అందరూ చూశారు.ఇక, ఇప్పుడు అతనిలోని మెంటల్ కృష్ణ మరో అవతారమెత్తాడు.

నంది అవార్డులోని న్యాయనిర్ణేతలనే కాదు… పోసాని తనకు వచ్చిన నంది అవార్డుపైన కూడా కాంట్రవర్శి క్రియేట్ చేశారు. గాయం, పవిత్ర బంధం, పెళ్లిచేసుకుందాం, శివయ్య లాంటి ఎన్నో మంచి సినిమాలకు రచయితగా పనిచేశానన్న ఆయన…అప్పుడు రాని నంది అవార్డు కర్మకాలి టెంపర్ సినిమాలో నటించినందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. అవార్డు ఇచ్చేందుకు ఎవరూ లేక తనకు ఇచ్చారని, అందుకే అది తనకు కమ్మ అవార్డులా కనపడిందన్నారు. అలాంటి అవార్డు వద్దని చెప్పి తిరస్కరించానని.. పోసాని వ్యాఖ్యానించారు. అంతేకాదు, గ్రూపులు, కులాల వారీగా నంది అవార్డులు పంచుకునేవారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల కమిటీకి 12 మంది న్యాయనిర్ణేతలుంటే, 11 మంది కమ్మవారే ఉంటే అవి కమ్మ అవార్డులే అవుతాయంటూ వ్యాఖ్యానించారు. అయితే, పోసాని కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. అవార్డుల్లో పారదర్శకత లేకపోతే, కులాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఆ లెక్కన పోసానికి, ఆయన చెబుతునన్నట్టుగా ఓ వర్గానికి చెందిన వారికే అవార్డులు రావాలి. కానీ, అలాంటిదేమీ జరగలేదు కదా. అంటే, ఓ వర్గాన్ని లక్ష్యంగా వైసీపీ చేస్తున్న కుట్రలో భాగంగానే పోసాని రెచ్చిపోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది.

జగన్ స్క్రిప్ట్ లో భాగంగానే, పోసాని నంది అవార్డులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంది అవార్డులపై పోసాని చేసినన వ్యాఖ్యలను నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ ఖండించారు. పోసాని వైసీపీ వ్యక్తి కాబట్టి, పార్టీపరంగా చేసిన కామెంట్స్ గా భావిస్తున్నామన్నారు. ఆయనకు టెంపర్ సినిమాలో అవార్డు వచ్చింది అంటే, ఆయన నటనను చూసి ఇచ్చారే గానీ, కులాన్ని చూసి ఇవ్వలేదని ప్రసన్నకుమార్ తెలిపారు. పోసాని చెప్పినట్టు 12 మంది సభ్యుల కమిటీలో 11 మంది కమ్మవాళ్లు ఉన్నారనేది పచ్చి అబద్ధం అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదించడం దురదృష్టకరమని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. అన్నదమ్ముల్లా ఉండే ఆర్టిస్టుల మధ్య అనవసరంగా చిచ్చుపెడుతున్నారని, పనిలేని వాళ్లే ఇలాంటివి సృష్టిస్తుంటారని పోసానిపై మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు గానీ మరెప్పుడైనా…సీల్డ్ కవర్ లో పేర్లు ఉంచి సీఎంకు ఇచ్చేవాళ్లమన్నారు. వాళ్లు ఓకే చేసి సంతకం పెట్టేవాళ్లు తప్ప, అందులో ఏ పేర్లు ఉన్నాయని ఏనాడూ చూడలేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ట్యాలెంట్ కే అవార్డులొస్తాయని స్పష్టం చేశారు.

కన్నతల్లిలాంటి కళామ్మతల్లి నీడలో ఉంటూ…తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాన ఇంతగా దిగజారి మాట్లాడతావా అంటూ ప్రొడ్యూసర్ చిట్టిబాబు పోసానిపై నిప్పులు చెరిగారు. చిల్లరవాగుడు కట్టిబెట్టాలని హెచ్చరించారు. మానసిక రోగిలా పోసాని మత్తితప్పి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కమ్మ వాళ్లే లేకపోతే అసలు పోసానికి బతుకు ఎక్కడిదని చిట్టిబాబు పోసానిపై ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు.అటు సోషల్ మీడియాలోనూ…. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే జగన్ భజన చేసుకో, అంతేగానీ నంది అవార్డులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తగదని పోసానికి చురక అంటిస్తున్నారు నెటిజన్లు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *