బండిని తప్పించడం వెనక ఇంత స్టోరీ ఉందా?

బండిని తప్పించడం వెనక ఇంత స్టోరీ ఉందా?

తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్ ని పట్టుకొని కార్యకర్తలు బోరున విలపిస్తున్నారు. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీకి నష్టమే కానీ.. లాభం ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంతర్గతంగా కూడా చర్చ జరుగుతోంది. అయితే, బండి సంజయ్‌ ని తొలగించడంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.

అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ వందలకోట్లు కూడబెట్టారనేది ప్రధాన ఆరోపణ. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే కథనాలు వస్తున్నాయి. పార్టీ నుంచి 30కోట్లు ఖర్చుపెట్టినట్లు సంజయ్ బిల్లులు పంపారని, అందుకు రాష్ట్ర ఇంఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీలోని కొందరు హైకమాండ్ కు నివేదించడం వల్లే…సంజయ్ ను సాగనంపారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తెలంగాణకు కొత్త ఇంఛార్జ్ గా ప్రకాశ్ జవదేకర్ ను బీజేపీ అధినాయకత్వం నియమించింది. సంజయ్, తరుణ్ చుగ్ లను తప్పించే ఉద్దేశంతోనే, హైకమాండ్ పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టిందనే టాక్ వినిపిస్తోంది.

అందుకు తగ్గట్లే, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలే చేశారు. పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్… వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ ఫండ్ లో తనకూ వాటా ఉందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాథం అని కూడా విమర్శించారు. అటు కేంద్రపెద్దలపైనా రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మాటలను వక్రీకరించారంటూ రఘునందన్ రావు చెప్పినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అయితే, రఘునందన్ కామెంట్స్ వెనక పార్టీ పెద్దల ప్రమేయం ఉందనే కథనాలు కూడా వచ్చాయి.

రాష్ట్రంలో పలు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఆ యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం పక్కన పెట్టి.. తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నించారని, ధనార్జనే లక్ష్యంగా బండి పని చేసినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయట. పలువురు నాయకులకు టికెట్లు ఇస్తాననే హామీ ఇచ్చి.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బండి సంజయ్‌ను తప్పించడంలో బీఎల్ సంతోశ్ కీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *