గొర్రెల ఫారం షెడ్ ల కోసం సబ్సిడీ రుణాలు : నారా లోకేష్ హామీ

గొర్రెల ఫారం షెడ్ ల కోసం సబ్సిడీ రుణాలు : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీతో షెడ్లు నిర్మాణం కోసం రుణాలు అందించి గొర్రెల ఫామ్ నిర్వహణ కు సహకారం అందిస్తాం. మందులు, ఫీడ్ అన్ని తక్కువ ధరకు అందించి గొర్రెల పెంపకంలో రైతులకి లాభం వచ్చేలా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆలూరు నియోజకవర్గం పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని లోకేష్ పరిశీలించారు. రైతు నాగమ్మ, ఆమె భర్త కృష్ణన్న గౌడ్ తో మాట్లాడి గొర్రెల పెంపకం లో వారు ఎదుర్కుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నాం. షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యింది. మొదటి ఏడాది 50 గొర్రెల తో ఫామ్ ప్రారంభించాం. రెండేళ్ల లో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నాం. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుంది. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుంది. ప్రభుత్వం నుండి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదని నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అధైర్య పడొద్దు అంటూ నాగమ్మకు లోకేష్ ధైర్యం చెప్పారు.

అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో కళ్లారా చూస్తున్నాను. గొర్రెల పెంపకం కోసం టిడిపి పాలనలో అనేక చర్యలు తీసుకున్నాం. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీ ధరకి అందించాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదు. టిడిపి హయాంలో షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందించాం. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి మినీ గోకులంలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు కనీసం గొర్రెల పెంపకం కోసం తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *