
రావణాసుర సినిమా పక్కా ఒరిజినల్ మూవీ – సుధీర్ వర్మ
- MoviesNews
- March 30, 2023
- No Comment
- 37
రావణాసుర సినిమాకు సంబంధించిన రవితేజ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి.. పోస్టర్, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా విడుదలైన రావణాసుర ట్రైలర్ మరింత హైప్ ను క్రియేజ్ చేసింది. రావణాసుర సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. నెగెటివ్ షేడ్స్‌తో కూడా.. ఆయన క్యారెక్టర్ కనిపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించిన రావణాసుర చిత్రాన్ని.. అభిషేక్ నామా, రవితేజ కలిసి నిర్మిస్తుండగా.. హర్షవర్దన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. రవితేజ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై.. అదిరిపోయే రేంజ్ ఉందనిపించుకుంది. రవితేజ రావణాసుర ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా చూపించారు. రావణాసుర చిత్రంలో..రవితేజ చాలా ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ తన మార్కు థ్రిల్లింగ్ అంశాలు చూస్తే.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.
రెండు నిమిషాల 7 సెకనుల నిడివితో కట్ చేసిన .. రావాణాసుర ట్రైలర్ విడుదల తర్వాత.. సినిమాపై ఫ్యాన్స్ అంచనాలను పెంచేసింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సుశాంత్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి , రెస్పక్ట్ మై ఆర్ట్ బేబీ, అనే డైలాగ్స్ రవితేజ ఫ్యాన్స్ కు ఇప్పటికే నచ్చేశాయి. ఫైట్స్ లలో రవితేజ ఎనర్జీ పీక్ లెవల్ లో ఉంది. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మాన్యూయేల్ నటిస్తోంది. ఈమెతో పాటు పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. రావు రమేష్, మురళీ కృష్ణ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. సుశాంత్ ఇందులో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రవితేజ పాడిన ప్యార్‌లోన పాగల్ అనే సాంగ్ విడుదలై మంచి హిట్ అయింది.
రావణాసుర సినిమా పక్కా ఒరిజినల్ మూవీ అని.. రీమేక్ కాదని.. రవితేజ పాత్రను దృష్టిలో పెట్టుకునే.. ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టామని దర్శకుడు సుధీర్ వర్మ తెలిపాడు. ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఓ వైవిధ్యమైన అంశం ఉంటుందని.. అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందని దర్శకుడు సుధీర్ వర్మ అన్నారు. రావాణాసుర మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.