
జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
- Ap political StoryNewsPolitics
- March 30, 2023
- No Comment
- 27
సాక్షి పేపర్ సర్కులేషన్ పెంచుకునేందుకు సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సాక్షి పత్రిక కొనుగోలు చేసుకునేందుకు ప్రతి నెలా వారికి 200 మంజూరు చేయడంపై ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. కేవలం సాక్షి పేపర్ అమ్మకాలు పెంచుకునేందుకే జీవో విడుదల చేయడంపై ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సీఎం జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా 13 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ పదికి వాయిదా వేసింది.
సీఎం సొంత పత్రిక సాక్షి సర్కులేషన్ పెంచుకునేందుకే ఇలాంటి జీవో ఇచ్చారని ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వారికే కాని, విమర్శించే వారికి కాదంటూ జీవోలో స్పష్టంగా ఉందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు సీఎం జగన్ రెడ్డి సహా, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.