
మాగుంటకు షాక్.. మధ్యంతర బెయిల్ రద్దు
- Ap political StoryNewsPolitics
- June 9, 2023
- No Comment
- 21
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నిందితుడు మాగుంట రాఘవకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం రాఘవ మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. అమ్మమ్మకు అనారోగ్యం కారణంగామాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, రాఘవ బెయిల్ కోసం చూపిన కారణాలు సరైనవి కాదని పేర్కొంటూ …ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం..అతని మధ్యంతర బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్‌లో రాఘవను కీలక పాత్రధారిగా పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.