
దూసుకెళ్తున్న టీడీపీ చైతన్య రథాలు
- Ap political StoryNewsPolitics
- June 26, 2023
- No Comment
- 22
భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న చైత్యన రథం-బస్సు యాత్రలు దూసుకెళ్తున్నాయి. ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. బస్సు యాత్రకు వెళ్లిన లీడర్లు .. డిజిటల్ స్లైడ్స్ ద్వారా.. టీడీపీ సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. చేయబోయే.. ప్రజా సంక్షేమాన్ని నేరుగా ప్రచారం చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దుర్మార్గపు విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలకు టీడీపీ పథకాలపై అవగాహన కల్పిస్తూ.. చైతన్య పరుస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ .. టీడీపీ మేనిఫెస్టో ఉద్దేశాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా చైత్యన రథం-బస్సు యాత్రలు సాగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో … వైసీపీ రాక్షస పాలనను అంతమొందించాలని, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు మీదే ఆధారపడి ఉందని టీడీపీ నేతలు ప్రజలకు చెబుతున్నారు.
ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే.. టీడీపీ తొలిసారిగా పథకాలను ప్రకటించిన తర్వాత.. విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. మహిళలు, వెనుకబడిన తరగతులు, రైతులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 125 నియోజకవర్గాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 5 జోన్లకు 5 బస్సుల ద్వారా మినీ మేనిఫెస్టోపై 25 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి .. టీడీపీ పథకాలు తెలిసేలా తీసుకెళ్లడంమే లక్ష్యంగా.. చైత్యన రథం-బస్సు యాత్రలు కొనసాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలందరూ.. ఆంధ్రప్రదేశ్‌లోని 125 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. మేనిఫెస్టో పథకాలపై సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలుగుదేశం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తే, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కృషి జరుగుతుందని.. ప్రజలకు వివరిస్తున్నారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన.. తొలి మేనిఫెస్టో.. ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. యువత, మహిళ, రైతులకు మేలు చేకూరేలా.. 6 పథకాలను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. పేదలను ధనవంతులు చేయడం కోసం.. పూర్ టూ రిచ్ అనే పథకం, బీసీలకు రక్షణ చట్టం, ఇం టింటికీ తాగునీరు, రైతుల కోసం అన్నదాత పథకం, ప్రత్యేకంగా మహిళా మహా శక్తి పథకాలను ప్రకటించారు. ఇంతే కాకుండా.. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ. మూడు వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలకు.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.