అభివృద్ధి పై చర్చకు సిద్ధం వైసిపి నేతలకు టిడిపి సవాల్‌

అభివృద్ధి పై చర్చకు సిద్ధం వైసిపి నేతలకు టిడిపి సవాల్‌

కడప నగరాభివృద్ధిలో భాగంగా తెలుగుదేశం పార్టీ పొలిటిబ్యూరో సభ్యులు శ్రీనివాస్‌ రెడ్ది ఒక్క సెల్ఫీ పెడితేనే వైసిపి నేతలు గిల గిల కొ ట్టుకుంటున్నారని టిడిపి క్రిష్టియన్‌ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంపీ సురేష్‌ ఎద్దేవా చేశారు. టిడిపి జిల్లా కార్యాలయంలో పార్లమెంట్‌ మీడియా కో ఆర్డినేటర్‌ జనార్దన్‌, టిడిపి నేతలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా శ్రీనివాస్‌ రెడ్ది పాత బస్టాండ్‌ వద్ద నున్న బ్రిడ్జి పూర్తి చేశామని సెల్ఫీ పెడితే వైసిపి నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారని విమర్శించారు. డిప్యూటీ మేయర్‌ నిత్యనంద రెడ్ది, వైసిపి నేతలు వారి హయాంలో అభివృద్ధి చేశామని చెప్పుకునే ధైర్యం లేక కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి చేసిన పనుల గురించి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముందు మీరు కాంగ్రెస్‌ పార్టీనా లేక వైసిపి పార్టీ నా క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారు.

ఈ నాలుగు సంవత్సరాల వైసిపి పాలనలో కడప నగరంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేక కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నాప్పుడు చేసిన అభివృధ్ధినే వైసిపి అభివృద్ధిగా చెప్పుకోవడం కంటే దారణమైన విషయం లేదన్నారు. వైసీపీ కడపలో ఏం అభివృద్ధి సాధించారో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *