
రూ.2వేల నోట్లు రద్దు ఘనత చంద్రబాబుదే..
- Ap political StoryNewsPolitics
- May 21, 2023
- No Comment
- 27
ఆయన చెప్పిందే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న 2వేల నోట్ల రద్దు కల నెరవేరింది. చంద్రబాబు ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. ఆయన ఎప్పుడూ దేశం కోసం భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఆలోచిస్తుంటారు. అందుకే ఆయనను విజనరీ లీడర్ అని అంటారు.
ఆయన ఆలోచనలను ఆచరణలో పెడితే ఎలాంటి ఫలితాలు సాధిస్తామో గతంలో అనేకసార్లు రుజువైంది. చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్విన నోళ్లే, నేడు ఆ అభివృద్ధి ఫలాలను చూసి ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2 వేల నోట్లను విత్ డ్రా చేసిన నేపథ్యంలో బాబు విజన్, ఆయన ఆలోచన తీరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. 2వేల నోట్ల రద్దు ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అంతా ప్రశంసిస్తున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేస్తే దేశంలో అవినీతి, బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ చాలా తగ్గుతాయని చంద్రబాబు కొన్నేళ్లుగా అనేక వేదికలపై చెబుతూ వస్తున్నారు. 500, వెయ్యికి పైన ఉన్న అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలన్నది చంద్రబాబు డిమాండ్. పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరుగుతోందని, నల్ల ధనం దాచుకొనేవారికి ఇది అనువుగా మారుతోందని ఆయన వాదించారు. అర్థ క్రాంతి అనే సంస్ధతో కలిసి ఆయన ఈ దిశగా కొన్ని సమావేశాల్లో కూడా పాల్గొన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500, వెయ్యి నోట్లను రద్దు చేసింది. అదే సమయంలో రెండు వేల నోటును కొత్తగా తీసుకువచ్చింది. దీనిని అప్పట్లోనే చంద్రబాబు వ్యతిరేకించారు. రెండు వేల రూపాయల నోటు తీసుకురావడం వల్ల నోట్ల రద్దు ప్రయోజనం నెరవేరదని, మళ్లీ నల్ల ధనం ప్రవాహం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు చెప్పినట్టుగానే దేశంలో విపరీతంగా నల్లధన ప్రవాహం కొనసాగింది. మరోవైపు నోట్ల రద్దు తర్వాత డిజిటల్ కరెన్సీ వాడకం పెంచడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం అప్పట్లో ఒక కమిటీని నియమించింది. దానికి చంద్రబాబుని అధ్యక్షునిగా వ్యవహరించారు.
ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. అందులో డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయాలని సిఫార్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబు రెండు వేల నోట్ల రద్దు డిమాండ్‌ను వినిపించారు.
2వేల నోట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. 2వేల నోటు రద్దు, డిజిటల్ కరెన్సీ పై కేంద్రానికి అప్పట్లో తాను రిపోర్టు ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. 2000 నోట్ల నిలిపివేత వల్ల మంచి ఆర్థిక వ్యవస్థకు నాంది పలకడంతోపాటు ప్రజల మేలు కోసం చిత్తశుద్ధితో పని చేసే నిజాయితీపరుల ప్రయత్నాలకు బలం చేకూరుతుందన్నారు.
తాను ఎల్లప్పుడు ప్రజల తరపున పోరాడతానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నోట్ల రద్దుపై మాట్లాడిన వీడియోలు సోషల్ మాడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఇటీవల హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ కూడా పెద్ద నోట్ల రద్దుపై ఆసక్తికర ప్రసంగం చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మొత్తంగా, పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకోవడం..ఆర్బీఐ 2వేల రూపాయల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం శుభదాయకమని పలువురు కొనియాడుతున్నారు. చంద్రబాబు దార్శనికతను ప్రశంసిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ మొత్తంలో 2 వేల నోట్లతో నిధులు దాచి పెట్టిన వాళ్లకి ఈ పరిణామం గట్టి దెబ్బే అని చెప్పాలి.