గన్నవరం టీడీపీ టికెట్ అతనికేనా?

గన్నవరం టీడీపీ టికెట్ అతనికేనా?

కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా గన్నవరం వైసీపీ కీలక నేత ఒకరు టీడీపీ వైపు చూస్తున్నారు. ఆ నేత ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. గన్నవరంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీని అధికారికంగా ప్రకటిస్తే వెంటనే, ఆ కీలక నేత జంప్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. గత నెలలోనే టీడీపీ తీర్థం పుచ్చు కోవాల్సి ఉంది. అయితే టీడీపీ నుంచి టికెట్ గ్యారంటీ లభించలేదని తెలుస్తోంది.

టీడీపీ అధినేత గన్నవరం టికెట్ గ్యారంటీ ఇస్తే వెంటనే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. అసలు గన్నవరం వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అవ్వడానికి సిద్దంగా ఉన్న నేత ఎవరు? టీటీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ఆ నాయకుడు ఎవరు.

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి గన్నవరం వైసీపీలో రచ్చ మొదలైంది.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి వల్లభనేని చేతిలో ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, 2019లో ఓటమి పాలైన యార్లగడ్డ వెంక్రటావు ఒక వర్గంగా ఏర్పడ్డారు. మొదటి నుంచి వీరు వల్లభనేని వంశీతో పోరాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు వైసీపీ నేతలపై 200లకుపైగా వల్లభనేని వంశీ అక్రమ కేసులు పెట్టించి వేధించాడని, ఇప్పుడు పార్టీలోకి వచ్చి

అధికారం చెలియిస్తామంటే కార్యకర్తలు అంగీకరించరని యార్లగడ్డ, దుట్టా ప్రకటించారు. గన్నవరం టికెట్ వల్లభనేని వంశీకి ఇస్తే సహకరించేది లేదంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ రెండు వర్గాలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి సీఎం నేరుగా మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా… వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీలో ఉంటారంటూ వైసీపీ అధిష్ఠానం సంకేతాలు ఇవ్వడంతో గత కొంత కాలంగా యార్లగడ్డ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారేందుకే యార్లగడ్డ వైసీపీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.

గన్నవరం వైసీపీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపిన యార్లగడ్డ సరైన సమయంలో పార్టీ మారేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. గన్నవరం నుంచి టీడీపీ టికెట్ ఇస్తారనే భరోసా లభిస్తే ఇక యార్లగడ్డ పార్టీ మారడం లాంఛనమే. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేదంటే వచ్చే ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహిస్తారా అనే విషయంలో క్లారిటీ వస్తే యార్లగడ్డ పార్టీ మారే వ్యవహారం తేలే అవకాశం ఉంది. ఏపీలో డిసెంబరులో ముందస్తు ఎన్నికల జరుగుతాయంటూ, సంకేతాలు వస్తే మాత్రం వచ్చే నెలలోనే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

గన్నవరం వైసీపీలో వల్లభనేని వంశీ వ్యవహారం ఆ పార్టీ పెద్దలకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తే పార్టీ బలపడుతుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేశారు. అయితే వారి అంచనాలు రివర్స్ అయ్యాయి. వల్లభనేని వంశీకి వైసీపీ నాయకులతోపాటు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా సహకరించడం లేదు. దీంతో వంశీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిని ప్రకటిస్తే గన్నవరంలో వంశీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేస్తే వల్లభనేని వంశీ గెలవడం అంత శులభం కాదు. ఏది ఏమైనా గన్నవరం రాజకీయాలు మాత్రం వేసవి ఎండలను తలపిస్తూ హాట్ హాట్ గా మారాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *