నాలుగేళ్ల నరకం అయినా..  అదరం .. బెదరం.. ఇదే.. మా గుండె ధైర్యం..

నాలుగేళ్ల నరకం అయినా.. అదరం .. బెదరం.. ఇదే.. మా గుండె ధైర్యం..

2019కు ముందు .. అనేక మాయ మాటలు చెప్పి.. అబద్ధపు హామీలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు తమ పార్టీకి 151 సీట్ లుఇచ్చారన్న అహంకారంతో విర్రవీగుతూ.. నాలుగేళ్ల పాలనలో వైసీపీ సర్కార్ చేయని అరాచకం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, చేస్తున్న ఆరాచకాలను ఎవరైనా.. ప్రశ్నిస్తే చాలు.. వారిని వెంటాడి వేధించి.. కేసులు పెట్టి.. రకరకాలుగా హింసించడం పరిపాటి. తామే నేరం చేసి ఎదుటి వారిపై నెట్టడంలో వైసీపీ దిట్ట. అధికారపక్షానికి ఒక రాజ్యాంగం, ప్రతిపక్షానికి మరో రాజ్యాంగం, సామాన్యులకు ఇంకో రాజ్యాంగం .. ఇలా రకరకాలుగా వైసీపీ వ్యవహరిస్తుంటే.. అందుకు పోలీసు వ్యవస్థ వంతపాడుతోంది. ఇదీ.. నాలుగేళ్లుగా.. ఏపీలో అమలవుతున్న జగన్ ట్రేడ్ మార్క్ రాజకీయం. వైసీపీ క్షుద్ర రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ.. టీడీపీ చేస్తోన్న నిరంతర పోరాటం.. చిరస్మరణీయం.

2019లో.. ఒక్కఛాన్స్ అంటూ.. అధికారంలోకి వచ్చిన జగన్ నుంచి.. మంచి పరిపాలననే ఆశించారు. కాని.. అంతా రివర్స్ పాలనేనని.. మూడు నెలల్లోనే తేలిపోయింది. చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతోనే తన పాలన ప్రారంభించారు. జగన్ పాలన సాగే కొద్దీ.. మరీ ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు,వేధింపులు అధికమయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రానికి జగన్ మంచి చేస్తాడని..ఒక ఏడాది వరకు.. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఓపిక పట్టింది. జగన్ పాలనలో అరాచకాలు మితిమీరడంతో.. టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. సాక్షాత్తూ.. శాసన మండలిలో.. ప్రజాసమస్యలపై చర్చించకుండా బూతులతో ఎదురుదాడికి దిగినా.. చట్టసభల గౌరవాన్ని శాసనమండలి ఛైర్మన్ గా ఉన్నప్పుడు షరీఫ్ కాపాడారంటే.. అదీ ఆయనకున్న గుండె ధైర్యం. ప్రజా సమస్యల పట్ల టీడీపీకి ఉన్న నిబద్ధత.

వైసీపీ పాలనా వైఫల్యాలను ఒక్కొక్కటిగా టీడీపీ ప్రశ్నిస్తూంటే.. ప్రజల్లో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వైసీపీ గ్రహించింది. అందుకే.. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై వైసీపీ మూకలు అనేకసార్లు దాడికి దిగాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంపై.. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. రెండు, మూడు చెక్ పోస్టులను దాటి తన అనుచరులతో దాడికి ప్రయత్నం చేశారు. అమరావతి పర్యటనకు వెళితే చంద్రబాబు బస్సుపై చెప్పులు, కర్రలు, లాఠీలు విసిరిన.. వైసీపీ మూకలకు డీజీపీ వంత పాడారు. పల్నాడు పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ కాన్వాయ్ పై వైసీపీ మూకలు దాడిచేస్తే దానినీ పోలీసులు వెనకేసుకొచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరిమూకలు ముప్పేట దాడికి తెగబడితే పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కుప్పంలో పర్యటన చేస్తుంటే చంద్రబాబుపై వైసీపీ మూకలు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా.. చంద్రబాబు ఎక్కడా తగ్గలేదు.. భయపడలేదు.. వైసీపీ అరాచకాలను.. ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.

వైసీపీ సర్కార్ పాలనపై ఏపీ టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకు పడితే.. అక్రమ కేసులు పెట్టి జగన్ సర్కార్ పైశాచిక ఆనందం పొందింది..పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా.. ఆందోళన చేసినందుకు.. చింతమనేని ప్రభాకర్ పై .. గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, భూములు దానం చేసిన అశోక్ గజపతిరాజుపైనా అక్రమ కేసులు పెట్టి వేధించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన.. ఆంధ్రప్రదేశ్ లో.. పెను దుమారం రేపింది. విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి ఘటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. వైసీపీని ప్రశ్నిస్తున్న .. నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై కూడా భౌతిక దాడులు చేశారు.టీడీపీ సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు వంటి వారిని అడ్డుకోవటం కోసం సామ, దాన, భేద, దండోపాయాలను జగన్ ఉపయోగించడం మొదలు పెట్టారు. అయినా .. టీడీపీ సీనియర్ నేతలు ఎక్కడా..తగ్గ లేదు..ప్రజల కోసం..తమ పోరాట పటిమ ఆపలేదు.

జగన్ పాలనలో ఎక్కడ చూసినా ఆటవిక అరాచకాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలే కొనసాగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తే.. ప్రశ్నించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి 120 మంది టీడీపీ కార్యకర్తలను.. తీవ్ర హింసలకు గురి చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన మారణహోమం..టీడీపీ నేతలపై .. వైసీపీ సర్కార్ సాధించిన కక్ష సాధింపునకు మచ్చు తునక. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, పోలీసులు కూడా శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమవుతున్నారన్న బీటెక్ రవిపై.. ఎన్నో హత్యయత్నాలు కూడా జరిగాయి. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టిన.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసి..ఫోన్లు లాక్కుని.. చిత్రహింసలు గురిచేసిన ఘటననూ.. ప్రజలెవరూ మర్చిపోరు.

జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, చేస్తున్న ఆరాచకాలను ప్రశ్నిస్తూ.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర చేపడితే.. ప్రతి నియోజకవర్గంలోనూ.. ఎన్నో కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో వైసీపీ పాలనను ప్రశ్నించిన.. సీనియర్ జర్నలిస్ట్ మహాసేన రాజేష్ పై కూడా కేసులు పెట్టి వేధించారు. వాట్సాప్‌లో పోస్టు చేసినందుకు విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అరెస్ట్ చేసి.. సీఐడీ కుట్ర కేసు పెట్టింది. ఇదీ జగన్ ప్రభుత్వ నైజం. ఈ విధంగా.. జర్నలిస్టులపై వైసీపీ పెట్టిన కేసులకు లెక్కే లేదు.. అయినా వేధింపులకు భయపడక.. ప్రజాక్షేత్రంలోనే ప్రజల తరఫునే ఉన్నారు.

వైసీపీ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా.. ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. టిడిపి కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని.. ఎవరూ దెబ్బతీయలేరు. వైసీపీ అరాచకాలను.. ప్రజల దృష్టి తీసుకెళ్లేందుకు..టీడీపీ నేతలు.. తమ ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడారు. అన్యాయాలు, అక్రమాలు అడ్డుకోవాల్సిన పోలీసులు కనీసం.. తమ విధులు నిర్వహించకుండా.. చోద్యం చూస్తున్నారే తప్ప.. ప్రజలకు ఏ మాత్రం న్యాయం చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి అదరక.. బెదరక..తలవొంచక.. ప్రజల బాగుకోసం.. రాష్ట్రం కోసం.. టీడీపీ అధినేత నుంచి కార్యకర్తల వరకూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోరాడుతూనే ఉన్నారు. అందుకే టీడీపీ పోరాట స్ఫూర్తి అభినందనీయం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *