
వైసిపి పాలనలో యువత భవిత ప్రశ్నార్థకముగా మారింది: కోండ్రు
- Ap political StoryNewsPolitics
- May 6, 2023
- No Comment
- 25
వైసీపీ పాలనలో రాష్ట్రంలో యువత భవిత ప్రశ్నార్ధకముగా మారిందని, ఉద్యోగాలు లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజాం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కొండ్రు మురళీమోహన్ విమర్శించారు. అశోక గజపతిరాజు బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు, మోసకారి మాటలతో ప్రజలను నట్టేట ముంచారన్నారు.
ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ ప్రగల్భాలు పలికి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఉద్యోగుల ఓట్ల కోసం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి నాలుగేళ్లు గడుస్తున్న ఆ మాటను నిలబెట్టుకోకపోగా ఉద్యోగులను అనేక ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు.