వేయి శుభములు కలుగు వేళ..

వేయి శుభములు కలుగు వేళ..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అంటే.. ఒక చరిత్ర.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖండాంతరాలు లోని 50 దేశాలు, వివిధ ప్రాంతాల్లో.. నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మినీ మహానాడులు నిర్వహించారు. బెంగుళూరు, హైదరాబాద్, అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాలలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడులను పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఈనెల 20 వ తేదీన జరిపిన శతజయంతి వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమాహేమీలు పాల్గొన్నారు. ఈ నెల 28 వ తేదీన ఎన్టీఆర్ .. జన్మదినంతో .. ఆ మహనీయుడు ఈ నేలపై జన్మించి నూరు వసంతాలు పూర్తవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే టిడిపి ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా ఆనవాయితీగా మే 27,28 తేదీలలో నిర్వహించే మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించేందుకు.. టిడిపి అధిష్టానం సన్నాహాలు జరుపుతోంది.

రాజమహేంద్రవరంలో .. నిర్వహించ తలపెట్టిన.. మహానాడుతో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. మహానాడు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన 15 కమిటీలకు .. ఎప్పటి కప్పుడు మార్గదర్శనం చేస్తూ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుని నుంచి .. క్షేత్రస్థాయిలో వున్న సామాన్య కార్యకర్త వరకు మహానాడును విజయవంతం చేయాలన్న పట్టుదల, కసితో పనిచేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడే విధంగా.. మహానాడులో చేపట్టనున్న తీర్మానాలపై యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీ కసరత్తు పూర్తి చేసింది.

మే నెలలో జరగనున్న .. మహానాడులో 19 తీర్మానాలు చేసి అవకాశం ఉంది. ఆ తీర్మానాల ముసాయిదాను పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయాల్సి వుంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రలో .. రాష్ట్రంలోని .. వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వింటూ.. పరిష్కారం చూపిస్తూ.. సాగుతున్నారు. ఆయా వర్గాలు నుంచి స్వీకరించిన వినతులు, లోకేష్ పరిశీలనలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకొని మహానాడు తీర్మానాలలో పొందుపరచే అవకాశం వుంది. 2024 ఎన్నికలకు సంబంధించి.. టీడీపీ ప్రకటించనున్న మేనిఫెస్టో కు మహానాడు తీర్మానాలు ఒక దిక్సూచిగా నిలువనున్నాయి.

మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ పర్యటనలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రలతో .. తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ఇదే ఉత్సాహాన్ని రానున్న ఎన్నికల వరకు కొనసాగించే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నిరంతర కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించారు.

రానున్న ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావటంతో పాటు .. మరో నాలుగు దశాబ్దాల పాటు అజేయంగా వుండేలా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. ఆ క్రమంలోనే పార్టీలో ఆవిర్భావ సమయం నుంచి వున్న సీనియర్ నాయకుల తో పాటు యువతకు సైతం తగు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దృష్టితోనే రానున్న ఎన్నికలలో 40 శాతం టికెట్ లు యువతకు కేటాయించాలనే దిశగా పార్టీ లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు దూరదృష్టి, చాణక్యం తో పాటు లోకేష్ పోరాట పటిమలు.. తెలుగుదేశం పార్టీకి రక్షా కవచంగా నిలిచాయి. 2024లో రానున్న ఎన్నికలు రాష్ట్ర మనుగడ, భవిష్యత్ ను మలుపు తిప్పేవి అనటంలో సందేహమే లేదు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో రాష్ట్ర భవిష్యత్ కు భరోసా లభించినట్టయింది.తెలుగుదేశం పార్టీకి అధికారంతో పాటు .. రాష్ట్ర భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగొందే శుభగడియల కోసం యావత్ తెలుగుజాతి వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *