కాలువ శ్రీనివాసులు అక్రమ అరెస్టుకు ఖండన

కాలువ శ్రీనివాసులు అక్రమ అరెస్టుకు ఖండన

అనంతపురం జిల్లా టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని దండు శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం గార్లదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలువ శ్రీనివాసులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. కాలువను కళ్యాణదుర్గం పోలీస్‌ స్టేషన్‌కి అక్రమంగా తరలించడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాపు సవాల్‌ను స్వీకరించి కాలువ మగాడిగా ఏన్‌.హనుమాపురం వెలుతుంటే దమ్ము, ధైర్యం లేక ఇంట్లో దాక్కుని పదుల సంఖ్యలో పోలీసులు అడ్డుపెట్టుకొని పోలీసుల చేత అక్రమ అరెస్ట్‌ చేయిస్తావా, సవాల్‌ విసిరితే ధైర్యంగా రావాలి కానీ పోలీసుల చేత కాలువను అక్రమ అరెస్ట్‌ చేయడం చాలా దుర్మార్గపు చర్యని అభివర్ణించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. కాలువ శ్రీనివాసులుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *