నెల్లూరులో ఆనంతో టీడీపీ నేతల భేటీ

నెల్లూరులో ఆనంతో టీడీపీ నేతల భేటీ

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటపాటు చంద్రబాబు, ఆనంలు సమావేశమై…జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్న రామానారాయణరెడ్డి , జిల్లా టీడీపీ నేతలతో భేటీ పొలిటికల్ హీట్ రాజేసింది.

మాజీ మంత్రులు అమర్‌నాథ్‌ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆనంతో సమావేశమయ్యారు. ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు టీడీపీ సీనియర్ నేతలు, తదితరులు హాజరయ్యారు. వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం రేపు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 12వ తేదీన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఆలోగా టీడీపీలో ఆనం చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *