టిడిపి ఆధ్వర్యంలో మేడే వేడుకలు

టిడిపి ఆధ్వర్యంలో మేడే వేడుకలు

అచ్యుతాపురం: మండలం పూడిమడక గ్రామంలో సోమవారం టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలను నిర్వహించారు. టిఎన్టి యు సి ప్రధాన కార్యదర్శి కొండబాబు, గ్రామ మాజీ సర్పంచ్‌ టిడిపి సీనియర్‌ నేత మేరుగ బాపునాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో టిడిపి జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోటీడీపీ గ్రామ అధ్యక్షుడు ఎం. వెంకటరావు, ఎం. మహేష్‌, ధోని ధోని, చేపల తాతరావు, ఎం. ధనరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా టి ఎన్‌ టి యు సి జెండాను ఆవిష్కరించి, కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. మాలేపాటి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *