జనం అంటే జగన్‌కి కక్ష: బాలకృష్ణ

జనం అంటే జగన్‌కి కక్ష: బాలకృష్ణ

యువశక్తిని సంఘటితంచేసి, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే ధ్యేయంగా, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు, రాష్ట్రానికిచేసిన మేలు, ఈప్రభుత్వం చేస్తున్న విధ్వంసం, వినాశనాన్ని గురించి ప్రజలకు తెలియచెప్పడానికే టీడీప ీయువనేత నారా లోకేశ్‌ కంకణ బద్ధుడై యువగళం పాదయాత్ర చేపట్టారని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తెలిపారు.

శుక్రవారం ఆయన శింగనమల యువగళం క్యాంప్‌ సైట్లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరా లు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…! ‘‘ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. యువత ఎక్కడ తనను ప్రశ్నిస్తారోనని జగన్‌ వారిని డ్రగ్స్‌, గంజాయి మత్తులో జోగేలా చేస్తున్నాడు. యువగళం పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా లోకేశ్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు ఎదొర్కుంటున్న సమస్యలు, కుంటుపబడిన రాష్ట్రాభివృద్ధి, పాలకుల అవినీతి గురించి లోకేశ్‌ బాగా చెబుతున్నారు. రాష్ట్రంలో చెత్తప్రభుత్వం అసమర్థపాలన సాగిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను సంవత్సరంలో పూర్తిచేస్తామన్నారు. 4ఏళ్లుఅయ్యింది. ఎక్కడా ఎలాంటి పనిజరిగింది లేదు. చివరకు కాపర్‌ డ్యామ్‌ దెబ్బతింటే, దాన్నికూడా బాగుచేయలేని అసమర్థస్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైంది. పరిశ్రమలులేక, ఉపాధిదొరక్క యువత వలసపోతున్నారు. సామాజిక పింఛన్లకు కోతపెట్టే దుస్థితికి వచ్చారు. జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులుచేయాల్సిన దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. గంజాయిసాగు, అమ్మకాల్లో ఏపీనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఇళ్లపై పన్ను, మరుగుదొడ్లపై పన్నుతో పాటు, ఆఖరికి చెత్తపై కూడా పన్నువేయడం ప్రజల దౌర్భాగ్యం కాకమరేమిటి? వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుక, మద్యంమాఫియాలు, భూకుంభకోణాల్లో మునిగితేలుతున్నారు.

రాజధాని అమరావతినిర్మాణాన్ని అపహాస్యంగా మార్చారు. భూములిచ్చిన రైతులు న్యాయంకోసం ఉద్యమిస్తే, వారికి అడ్డంకులు కల్పిస్తూ ఆనందిస్తున్నారు. రైల్వేజోన్‌ ఊసే ఎత్తడంలేదు. ప్రత్యేకహోదా తెచ్చి పరిశ్రమలురాబట్టి, ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు కల్పిస్తామన్నారు. 4ఏళ్లు అయినా ఎప్పుడూ కేంద్రంతో దానిగురించి మాట్లాడిరదిలేదు. కేంద్రంనుంచి నిధులుకూడా రాబట్టుకోలేని దుస్థితిలో ఏపీప్రభుత్వం ఉంది. 17లక్షలకోట్లలో సుమారు రూ.7లక్షలకోట్లు విద్యుత్‌ రంగానికి ఖర్చుపెట్టామంటూ గిగాబైట్‌ అన్నారు. ముఖ్యమంత్రికి గిగాబైట్‌ కి, మెగాబైట్‌ కి తేడాతెలుసా? అలాంటివాటి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమఅరెస్ట్‌ లు. బడ్జెట్లో అంకెలగారడీతో ప్రజల్ని మసిపూసి మాయచేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.’’ అన్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగుజాతికోసం స్థాపించిన పార్టీ తెలుగుదే శం. కూడు, గుడ్డ, నీడ నినాదంతో పార్టీనిస్థాపించి, పేదలకుసేవ చేయడమే ధ్యేయంగా ముందుకు సాగిన మహానుభావుడు ఎన్టీఆర్‌ గారు. ఆయనబాటలోనే చంద్రబాబుగారు పార్టీ ని సంక్షేమం, అభివృద్ధి అనే రెండుచక్రాలతో సమర్థవంతంగా నడిపించారు. ఈ ప్రభుత్వంలో వినాశనం తప్ప ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉందా? సలహాదారుల్ని పెట్టుకొనివారికి జీతాలి స్తూ జగన్‌ ఎందుకూ పనికిరాని పాలనచేస్తున్నాడు. మూడేళ్లు రాజధానిపేరుతో పబ్బంగడి పాడు, తరువాత నవరత్నాలపేరుతో లక్షలకోట్ల అప్పులుతెచ్చి అంతిమంగా రాష్ట్రాన్నే నాశనం చేశాడు. మరలా జగన్‌ అధికారంలోకివస్తే, ప్రజలు బతికేపరిస్థితే ఉండదు. ప్రజలు ఎవరిమాయలోనే పడి మోసపోకుండా ఆలోచించి నిర్ణయంతీసుకోవాలి. రాష్ట్రం మరోశ్రీలంక కాకుండా ప్రజలే మంచినిర్ణయం తీసుకోవాలి. మరలా వైసీపీకి ఓటేస్తే అందరం రాష్ట్రం విడిచి పోవడంతప్ప మరోమార్గంలేదని ప్రజలకు మనవిచేస్తున్నాను. ప్రజలే వారికోసం, రాష్ట్రంకో సం వారికున్న ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించాలని కోరు తున్నాను. కులాలరొచ్చులోపడి, నవరత్నాలమోజులో పడి, భవిష్యత్‌ ను విస్మరించి, ఓటుని నిర్వీర్యంచేసి రాష్ట్రవినాశనానికి కారకులుకావద్దని ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాను
.
జనం అంటే జగన్‌ కు కక్ష. అందుకే వారిని హింసిస్తూ మరలా వారే తనను ఆదరించాలం టూ సైకోలా ప్రవర్తిస్తన్నాడు. యుగళంపాదయాత్రలో యువతే కాదు, మహిళలు, వృద్ధులు, అందరూ భారీస్థాయిలో పా ల్గొంటున్నారు. నాకు వ్యక్తిగతవిషయాలు, దాపరికాలు ఏమీఉండవు. నా జీవితం తెరిచిన పుస్తకం. లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలి. వైసీపీలోని బుడగ పగిలిపోయే సమయంవచ్చింది. వైసీపీఎమ్మెల్యేలే అసంతృప్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కు పాల్పడ్డారు. వైసీపీఎమ్మెల్యేలు చాలామంది స్వచ్ఛందంగా టీడీపీలోచేరి ప్రజాసేవ చేస్తామంటున్నారు. ప్రధానిమోదీ రాష్ట్రంలోజరిగే నేరాలు, ఘోరాలగురించి ప్రస్తావించి, వాపోయారు. తెలుగుదేశంపార్టీ యొక్క నిజాయితీ, పట్టుదలపై ఇతరపార్టీలవారు కూడా ఇష్టంతో ఉన్నారు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కుడు అంతా పబ్జీఆటకే పరిమితం. మద్యం, డ్రగ్స్‌ , గంజాయిని యువతలోకి చొప్పించి, వారు నోరెత్తకుండా చైతన్యహీనుల్నిచేసి, ఎవరూ ప్రశ్నించకుండా చేయాలన్నదే పాలకులఉద్దేశం.

జనంపై జగన్‌ కు కక్ష. కక్షసాధింపుల్లో భాగంగానే ప్రజల్ని ఇంతదారుణంగా హింసిస్తున్నారు. జగన్‌ అనే సైకోదెబ్బకు రాష్ట్రప్రజలు రోగుల్లామారి నానాఅవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను, పేదలకు ఇవ్వడానికి జగన్మోహన్‌ రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటి? లక్షలాదిఇళ్లను పట్టించుకోకుండా గాలికొదిలేయడంతో అవన్నీపాడుపడ్డాయి. జగన్‌ వాటిని పేదలకు ఇచ్చి నా ఎవరూ వాటిలోకివెళ్లవద్దు అనికోరుతున్నా. నన్నురాజకీయంగా ఆదరిస్తున్న హిందూపురం ప్రజలకు హృదయపూర్వక ధన్య వాదాలు తెలియచేస్తున్నాను. నటుడిగా, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వరిస్తున్నాను. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే శుభసూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి తుదిశ్వాసతో జీవిస్తున్నాడు..ఆ విషయం అతనికీ తెలుసు. వాస్తవాలు బయటపెట్టడం లో మీడియాకూడా వెనుకంజవేయకుండా ధైర్యంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి పబ్లిక్‌ మీటింగుల్లో మాట్లాడేమాటలన్నీ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని హింసిస్తూ, మరలా నన్ను ఆదరించండి అని ఆయనే అనడం విచిత్రంగా ఉంది.’’ అని అన్నారు

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *