గుడివాడలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

గుడివాడలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

గుడివాడలో దుర్మార్గుల అరాచకాలను అరికట్టడానికి, నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ 14వ వార్డు పంచవటి కాలనీ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. టిడిపి శ్రేణులతో కలిసి రావి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇదేం కర్మ రా బాబు అని ప్రజలనుకునే పరిస్థితి ఏర్పడిరదన్నారు.

అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అవమానించెలా గుడివాడ, రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ పాదయాత్ర, చంద్రబాబు రోడ్‌ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటాన్ని చూసిన వైసిపి నేతల్లో వణుకు మొదలైందన్నారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి పనులకు రంగులు మార్చి తామేదో చేసినట్లు వైసిపి నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని రావి ఎద్దేవా చేశారు.
గుడివాడ, రాష్ట్రంలోని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని రావి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్‌, టిడిపి నేతలు ముల్లపూడి రమేష్‌ చౌదరి, సొంటి రామకృష్ణ, పండ్రాజు సాంబయ్య, గోవాడ శివ, షేక్‌ జానీ, మజ్జాడి నాగరాజు, తదితర నేతలు పాల్గొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *