ప్రమాదపుటంచున డ్వాక్రా సంఘాల మనుగడ  ప్రభుత్వంపై తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ చార్జి షీట్ విడుదల

ప్రమాదపుటంచున డ్వాక్రా సంఘాల మనుగడ ప్రభుత్వంపై తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ చార్జి షీట్ విడుదల

రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా డ్వాక్రా సంఘాల ఉనికి ప్రమాదంలో పడింది. స్వావలంబన, ఆర్ధికాభివృద్ధి ఆశయాలతో మొదలుపెట్టిన డ్వాక్రా సంఘాల భవిష్యత్ నేడు ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబు నాయుడు కనబర్చిన ప్రత్యేక శ్రద్ధ కారణంగా డ్వాక్రా సంఘాలు దినదిన ప్రవర్ధమానమై బలీయమైన వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. డ్వాక్రా సంఘాలు అంటేనే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పుకునే పరిస్తితి వుండేది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు పరిశీలిస్తే డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందన్నా సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం తీసుకు వచ్చిన సింగిల్ విండో విధానంతో డ్వాక్రా సంఘాల ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్న పరిస్థితి వుంది. డ్వాక్రా సంఘాల ఆర్ధిక లావాదేవీలను గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తేవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పధకాలకు అర్హత పొందాలంటే వాలంటీర్ ల అనుమతి తప్పనిసరిగా వున్నపరిస్థితి నెలకొని వుంది.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో డ్వాకా మహిళలకు జరిగిన అన్యాయంపై టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ సభ్యులు ఛార్జిషీట్ విడుదల చేశారు. కమిటీ అధ్యక్షురాలు ఆచంట సునీత తో పాటు పలువురు మహిళా కమిటీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఆ చార్జి షీట్ లో గత నాలుగేళ్ల కాలంలో డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయంపై చార్జి షీట్ విడుదల చేశారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *