గంజాయి వద్దు బ్రో….. యువగళం పాదయాత్రలో లోకేష్, బాలకృష్ణ ల సందేశం

గంజాయి వద్దు బ్రో….. యువగళం పాదయాత్రలో లోకేష్, బాలకృష్ణ ల సందేశం

యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లు గంజాయి వద్దు బ్రో అంటూ ప్రచారం నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర కి నందమూరి బాలకృష్ణ తో పాటు, నందమూరి యూత్ సంఘీభావం తెలిపి యాత్రలో పాల్గొన్నారు. గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ లు సందేసమిచ్చారు.

నందమూరి యువత, టిడిపి నాయకులు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, టిడిపి కార్యకర్తలు, వాలంటీర్లు అందరూ గంజాయి వద్దు బ్రో అని రాసి వున్న టీ షర్ట్ లు, క్యాప్ లు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. గంజాయి కి ఏపి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అంటూ గత 63 రోజులుగా నారా లోకేష్ డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారింది అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆఖరికి తిరుమలని సైతం వైసిపి గంజాయి మాఫియా వదలడం లేదు అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమలలో గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయిని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు గంజాయి పంట వేస్తున్నారు అని ఆరోపించారు. పాదయాత్ర లో ఉండగా చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయికి బానిస అయ్యింది అని చెప్పింది. ఆ సంఘటన నన్ను కలచివేసింది అని లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గంజాయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. టిడిపి హయాంలో పెట్టిన డిఎడిక్షన్ సెంటర్లు కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. యువత అంతా డ్రగ్స్, గంజాయి కి దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి గంజాయి మాఫియా పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *