బీసీలకు అండగా టీడీపీ.. రాజీపడే ప్రసక్తే లేదు- అచ్చెన్నాయుడు

బీసీలకు అండగా టీడీపీ.. రాజీపడే ప్రసక్తే లేదు- అచ్చెన్నాయుడు

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. బిసిలను వేధించడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగుతోందని.. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతోనే బిసిలకు గుర్తింపు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించిందని ఆయన చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బిసిలను హత్య చేయడం, బిసి నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించడం పరిపాటిగా మారిందని.. అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తెలుగుదేశం పార్టీ బిసిలకు అండగా నిలుస్తుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు తెగేసి చెప్పారు. ఎన్టీఆర్ హయాం నుంచే.. బీసీలకు ప్రాధాన్యత కల్పించామని.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 27 శాతం రిజ్వేషన్లు కల్పించారని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. 34 శాతానికి పెంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి.. బీసీలు కూడా అండగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. 2014-19లో జనాభా ప్రాతిపదికన బీసీలకు బడ్జెట్ ఇచ్చామని.. ఆనాడు అధునాతన పరికరాలు ఇచ్చి ఆదరణ చూపామన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో.. విభజించడం, పాలించడం అలవాటైందన్నారు.54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ నామమాత్రంగా మిగిలాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జన గణన జరిగేటట్లు చూడాలని అచ్చెన్నాయుడు చెప్పారు. బీసీలు అంటే.. బలహీన వర్గాలు కాదని.. సమాజంలో బలమైన వర్గాలన్నారు. వచ్చే మహానాడులో మ్యానిఫెస్టోపై.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలో ముసాయిదా మ్యానిఫెస్టో విడుదల చేస్తామని.. విస్తృతమైన చర్చ జరిగాక .. ఎన్నికల్లో తుది మ్యానిఫెస్టో ప్రవేశ పెడతామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే.. బీసీలకు సాధికారత లభిస్తుందని.. బీసీలు గెలవాలంటే.. టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *