హలో బండి గారు.. అంతా మీ ఇష్టమేనా..? ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు

హలో బండి గారు.. అంతా మీ ఇష్టమేనా..? ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు

జీపీఎస్ విధానంపై.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలను సమర్థిస్తూ .. సీఎం జగన్‌ను ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు పొగడ్తలతో ముంచెత్తడంపై .. ఉద్యోగులు మండిపడుతున్నారు. జీపీఎస్ ప్రతిపాదనలు.. మహాద్భుతమంటూ.. సీఎం జగన్ ను.. పొగడటం.. దేనికి సంకేతమని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జగన్ సర్కార్ పెద్దలతో.. భేటీకి ముందే పదవి విషయంలో బండి శ్రీనివాసరావుకు ఒప్పందం కుదిరిందని.. అందుకే.. జగన్‌ భజన చేశారంటూ.. ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బండి శ్రీనివాసరావు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పదవీవిరమణ చేయనున్నారని.. ఆ తర్వాత కూడా ఏదో ఒక పదవిలో కొనసాగేలా స్కెచ్‌ వేశారని మండిపడుతున్నారు. లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టడం పట్ల.. ఆగ్రహంతో రగిలి పోతున్నారు.

జీపీఎస్ విధానం, వాటి పర్యవసానాలపై ఏపీ జేఏసీలో చర్చించాల్సి విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం తీసుకోకుండా ఉద్యోగులు, జేఏసీ సంతృప్తిగా ఉన్నాయని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని బండి శ్రీనివాసరావును సూటిగా ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ ప్రతిపాదించడం వల్ల .. ఉద్యోగులెవరూ..సంతృప్తిగా లేరని యూటీఎఫ్ నేతలు అంటున్నారు. గత పీఆర్సీ బకాయిలు చెల్లింపులు, కొత్త పీఆర్సీ ప్రకటన, అంశాలపై స్పష్టత లేకుండానే.. బండి ఎలా ప్రకటిస్తారని తీవ్రంగా దుయ్యబట్టారు. 2014 జూన్‌ 2నాటికి ప్రభుత్వ విభాగాల్లో 10 వేల 117మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని.. ఏపీ కేబినెట్ నిర్ణయం ప్రకారం కేవలం 6 వేల 666 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అవుతారని… మిగిలిన వారి పరిస్థితి ఏంటని.. యూటీఎఫ్ నేతలు ప్రశ్నించారు.

విశ్వవిద్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ఎప్పుడు చేస్తారో స్పష్టత లేకుండానే .. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని.. బండి ఎలా మెచ్చుకుంటారో తెలపాలని కోరారు. ఎన్జీవో సంఘం సమావేశం తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలను జేఏసీలో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి, జరిగిన పరిణామాలపై చర్చించాలని యూటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని.. మరి కొన్ని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ కూడా.. తమ నేతలు ఇంతలా దిగజారిన సందర్భాలు లేవని .. ఉద్యోగులు మండిపడుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *