
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు
- NewsPoliticsTelangana Politics
- June 2, 2023
- No Comment
- 22
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ అంతటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…సచివాలంయంలో నిర్వహించిన వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు. మరోవైపు, అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరవీరులు చేసిన కృషిని కొనియాడారు. దేశం నవ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, తెలంగాణ ప్రగతిపథంలో దూసుకెళ్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. దశాబ్ది వేడుకల వేళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పోడుభూములకు పట్టాలివ్వడంతో పాటు రైతు బంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వరాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.