తెలంగాణ నూతన సచివాలయం హైలెట్స్

తెలంగాణ నూతన సచివాలయం హైలెట్స్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం తళుకులీనుతోంది. ప్రభుత్వ కార్యకాలాపాల వేదికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించిన సచివాలయంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారులు నేటి నుంచి కొలువుదీరనున్నారు. ముఖ్యమంత్రి సహా అందరి కార్యాలయాలు, సిబ్బంది పనిచేసే విభాగాలన్నిటినీ ఆధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గతంలో మాదిరి మంత్రులు ఓ చోట, అధికారులు మరో చోట లేకుండా…అందరూ ఒకే అంతస్తులో ఆశీనులయ్యేలా కార్యాలయాలను రూపొందించారు.

అధికారులు, సిబ్బంది కోసం చేసిన ఏర్పాట్లు అత్యంత సౌకర్యవంతంగా ఉన్నాయి. ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయ ఛాంబర్‌ కిటికీలకు బుల్లెట్‌ప్రూఫ్‌ అద్దాలను అమర్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా సచివాలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. వేద పండితులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చే శాసనసభ, శాసనమండలి సభాపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టింది ప్రభుత్వం. ఇటీవలే ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించింది కూడా. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కొలువుదీరనున్న వేళ అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *