కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు 1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆట డ్యాన్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయ‌న‌.. లాహిరి లాహిరి లాహిరిలో , సీత్తయ్య, లాంటి దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. సినిమాలకు దూరంగా ఉండి గ‌త కొంత కాలంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారు. సొంతంగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టుకొని.. చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్‌ను నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు. పెక్యూలర్‌ మెనరిజమ్‌ స్టైల్‌తో కామెడీ షోస్‌లో కూడా మెరుపులు మెరిపించారు.

విజయనగరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండ‌గా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రాకేశ్ మాస్టర్ మరణవార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. లాక్ డౌన్ టైంలో రాకేశ్ మాస్టర్‌ చేసిన వీడియోలు బాగా వైర‌ల్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు రాకేష్ మాస్టర్ శిష్యులే.

సాటివారికి సాయం చేయాలనే తత్వం, ముక్కసూటీ తనంతో తన కెరీర్‌నే కోల్పోయాడు రాకేశ్‌ మాస్టర్‌. దాంతో అయిన వారికి దూరం అయ్యాడు. మద్యంకు బానిసయ్యాడు. రిసెంట్‌గా హానుమన్‌ షూటింట్‌లో పాల్గోన్నాడు. అక్కడ బ్లడ్‌ మోషన్స్‌, వోమిటింగ్స్‌ అయ్యాయి. అప్పటికే ఆరోగ్యం బాగోలేదు. వైద్యులు కూడా రెండు నెలలకు కంటే ఎక్కవ బ్రతకారని చెప్పారట. అప్పటి నుంచి మందుకొట్టడం రెండు నెలలు మాసేశారు. చూట్టపక్కల వారు బలవంత చేయడంతో మళ్ళీ మొదలు పెట్టారు. ఈ మద్యం తో బాడీలో మార్పులు వస్తున్నాయి నేను అస్తమించే సూర్యుడి అని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన యూట్యూబ్‌ ఛానల్‌ కోసం విజయనగరం వెళ్ళారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక మళ్ళీ బ్లడ్‌ మోషన్స్‌, వోమిటింగ్స్‌ అయ్యాయి. దాంతో హాస్పిటల్‌ అడ్మిట్‌ అయ్యారు. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసిన సన్‌ స్ట్రోక్‌ కారణంగా రాకేశ్‌ మాస్టర్‌ తుది శ్వాస విడిచారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *