తమన్‌, మహేష్‌ మధ్య వార్‌

తమన్‌, మహేష్‌ మధ్య వార్‌

త్రివిక్రమ్‌, సూపర్‌స్టార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా అంటూ చాలా హైప్‌ క్రియేట్ అయింది. కానీ అది ఏ మూహుర్తన స్టార్ట్‌ అయిందో కానీ కంటిన్యూస్‌గా ఏదోక రూపంలో డిలే అవుతునే ఉంది. కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను ఇష్టపడి తెచ్చుకున్నారు. కానీ వాళ్ల వర్క్ నచ్చలేదని తీసేశారు. వాళ్లకు ఇచ్చిన అడ్వాన్స్, ఆ ఫైట్ షూట్ కు చేసిన ఖర్చు అంతా వేస్ట్‌ అయింది. తరువాత విలన్‌ని మార్చేశారు. చివరకు కథను కూడా మార్చేశారు. ఇలా అన్ని మార్చుకుంటు ఆగుతూ నడూస్తూ ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ కూడా 10పర్సెంట్ మాత్రమే అయింది. మహేష్‌ సమ్మర్‌ వెకెషన్‌ అని ఫారిన్‌లో విల్లా రిజిస్ట్రేషన్‌ అంటూ షూటింగ్‌కు దురంగానే ఉంటు వచ్చాడు. ఇప్పుడు సినిమా నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ను కూడా పక్కన పెట్టశారు.

తమన్‌, మహేష్‌ మధ్య వార్‌ నడుస్తుందని మాట మాట పెరిగిందని గత రెండు రోజులు నుంచి టాక్‌ నడిచింది. దాంతో గొడవ ముదరడంతో తమన్‌ గుంటూరు కారం నుంచి అవుట్‌ అయ్యాడు. దానికి కౌంటర్‌గా తమన్‌ నా ఆఫీస్ దగ్గర మజిగ్గ షాప్‌ పెడుతున్నాను.. ఎవరికైనా కడుపుమంటగా ఉన్న వారందరికి స్వాగతం.. నాకు చాలా పని ఉంది డోంట్ వెస్ట్ మై టైమ్‌ అని పోస్ట్‌ పెట్టాడు. అక్కడితో ఆగలేదు సగం వల్చిన అరటిపండు పోస్ట్‌ పెట్టాడు. పేరుకు కడుపు మంట అంటునే.. అరటిపండుతో నెగిటివ్‌ సెన్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఇక్కడ కడుపు మంట ఎవరికి అన్నది క్లారీటీ లేదు. నిర్మాతలే బయటకు వచ్చి నోరు విప్పాలి.

సినిమా షూటింగ్‌ మొదలైన దగ్గర నుంచి ఎవరోకరిని మార్చుతునే ఉన్నారు. ఇప్పడు తమన్‌ టర్న్‌ వచ్చింది. నెక్ట్‌ పూజా హెగ్దే కూడా సినిమా నుంచి అవుట్‌ అనే టాక్‌ వినిపిస్తుంది. త్రివిక్రమ్‌ కూడా మహేష్‌ సినిమా కంటే అధర్‌ యాక్టీవిటీస్‌ పై ఫోకస్‌ పెడుతున్నాడట. పవర్‌స్టార్‌ బ్రో మూవీ వర్క్‌ పైనే ఎక్కవ కేర్‌ తీసుకుంటున్నాడట. అంతే కాకుండా ఆహ కోసం అల్లు అర్జున్‌ అర్జున్‌లీలా అంటు రకరకాల వ్యపకాలతో బిజీగా ఉన్నాడట. మహేష్‌ కూడా కథలో మార్పులు చేయమని చెప్పాడట. ప్రస్తుతానికి గుంటూరు కారం మూవీ పరిస్థితి అస్థవ్యతంగా ఉంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *