
టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కీలక ప్రకటన
- Ap political StoryNewsPolitics
- September 14, 2023
- No Comment
- 13
వైసీపీపై యుద్ధం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేశారు. రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసొస్తుందని చెప్పారు. వైసీపీపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. జాగన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ అరాచకాలను ఎదుర్కోలేమన్న పవన్ కళ్యాణ్… ఇక తామేంటో చూపిస్తామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘటన చర్యలను… ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు జనసేనాని. జగన్ కు ఇంకా ఆర్నెళ్లు మాత్రమే టైమ్ ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.