దళిత సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం..  ఈ కేటాయింపులే తిరుగులేని సాక్ష్యం..!!

దళిత సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం.. ఈ కేటాయింపులే తిరుగులేని సాక్ష్యం..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో దళిత సంక్షేమం కోసం విశేషమైన కృషి జరిగింది. ఆయన పాలనలో సుమారు 30 లక్షల మందికి పైగా దళితులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందారు. వేల కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను నూటికి నూరు శాతం దళిత వాడల్లో ఖర్చు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వందల కోట్ల రూపాయలను రుణాలుగా అందించి దళిత యువత స్వయం ఉపాధికి బాటలు వేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ విదేశీ విద్య వంటి పథకాలతో దళిత విద్యార్థులకు దన్నుగా నిలిచింది. సుమారు 27కు పైగా పథకాలను దళిత సంక్షేమం కోసం అమలు చేసింది. వాటిలో కొన్ని ముఖ్య పథకాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

1) 2014-2019 మధ్య ఐదేళ్ళ కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద దళితుల కోసం సుమారు 33 వేల 623 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు ఖర్చు పెట్టారు. దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.

2) ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు 2 లక్షల 66 వేల మంది దళిత యువతకు 3 వేల 800 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ రుణాలు అందించారు.

3) 7 వేల 500 మంది ఎస్సీ యువతకు ఆటోలు, 485 మందికి ఇన్నోవా కార్లు, 294 మందికి ట్యాక్సీ వాహనాలు, 660 మందికి డ్రైనేజీ పూడిక తీత యంత్రాలు, ఇతర ప్యాసింజర్ వాహనాలను చంద్రబాబు హయాంలో పంపిణీ చేశారు.

4) భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు భూమి కొనుగోలు పథకం ద్వారా ..2 వేల 386 ఎకరాల భూమిని కొనుగులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వం.. 1 వేయి 606 మంది ఎస్సీ మహిళలకు ఉచితంగా పంపిణీ చేసింది.

5) దళిత రైతులకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఏటా 25వేలు నగదు ప్రోత్సాహకం అమలు.

6) చంద్రన్న బీమా పథకం కింద ఎస్సీలకు 5 లక్షలు ఆర్ధిక సహాయం పంపిణీ

7) గ్రామీణ ప్రాంతాల్లో పేద దళిత రైతులకు ముర్రా గేదెలు, ఆవులు, గొర్రెలు పంపిణీ చేశారు. మినీ డైరీల ఏర్పాటుతో దళితుల ఆర్ధిక ప్రగతికి పాటుపడ్డారు.

8) దళిత విద్యార్దులకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని చంద్రబాబు అమలు చేశారు. ఈ పథకం ద్వారా ప్రతీ విద్యార్ధికి 15 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. వందలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యకోసం విదేశాలకు పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

9) ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యే దళిత విద్యార్థుల కోసం విద్యోన్నతి స్కీమ్‌ను చంద్రబాబు అమలు చేశారు. ఈ పథకం ద్వారా ప్రధాన నగరాల్లోని బెస్ట్ కోచింగ్ సెంటర్లలో దళిత విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించారు. వారి హాస్టల్ ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 3 వేల 300 మంది దళిత విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది కలిగించారు.

10) దళిత యువతకు అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించేందుకై చంద్రబాబు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేశారు. సమీపంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళలో దళిత విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించారు. ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో సుమారు లక్ష మందికి పైగా దళిత విద్యార్థులు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందుకున్నారు.

11) గ్రామీణ ప్రాంతాల్లో దళితుల ఇళ్ల నిర్మాణానికి అదనంగా 50 వేల రూపాయల అర్ధిక సహాయాన్ని, ఇటుకల కోసం 25 వేల రూపాయలను చంద్రబాబు అందించారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో దళితులకు అదనంగా 5 లక్షల రూపాయలు అందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది.

12) కులాంతర వివాహాలు చేసుకునే దళిత యువతీ, యువకులకు ప్రోత్సాహకంగా 75 వేల రూపాయలు అందించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండానే చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేశారు.

13) రైతు రథం పథకం ద్వారా దళిత రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేస్తే ఒక లక్ష రూపాయల వరకు నగదు సబ్సిడీ అందించారు.

14) నూనత పారిశ్రామిక విధానం ద్వారా దళిత యువతకు రుణాలు మంజూరు. దళిత పారిశ్రామిక వేత్తలకు 75 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహక సబ్సిడీ.

15) దళితులకు ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం సుమారు 11 వేల ఎకరాల అసైన్డ్ భూముల స్వాధీనం

16) దళిత విద్యార్థుల కోసం ఏపీ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ విజయవంతంగా నిర్వహణ. వేలాది మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చారు

17) క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేశారు. కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు తీసుకున్నారు.

ఇలా తన ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో దళిత సంక్షేమానికే పెద్దపీట వేశారు. 27కు పైగా పథకాలను అమలు చేసి..లక్ష కోట్ల రూపాయల వరకు నిధులను ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు కే దక్కుతుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో దళిత సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. అందుకే.. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా.. చంద్రబాబు చేసిన మేలును మరువలేమని దళిత సోదరులు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *