
కమల్‌హాసన్ దెబ్బకి ప్రభాస్ తట్టుకుంటాడా?
- EntertainmentMoviesNews
- June 28, 2023
- No Comment
- 18
ప్రాజెక్ట్ కే.. ఈ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఇప్పటీకే ఈ ప్రాజెక్ట్‌లో పెద్ద పెద్ద వాళ్ళంతా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 50 ఏళ్ళ కిత్రం కలిసి నటించిన అమితాబ్, కమల్ కాంబో మళ్ళీ ఈ సినిమా కోసం కలిసారు. ప్రాజెక్ట్ కే కోసం కమల్ విలన్ అంటే అందరు రుమర్ అనుకున్నారు. కానీ ఫేక్ న్యూస్ కాదని ఫ్యాక్ట్ అని మూవీ చిత్ర యూనిట్ ఇచ్చిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో క్లారీటీ వచ్చింది. ప్రాజెక్ట్ కే కోసం లోకనాయకుడు కదిలివచ్చాడు. నాలుగు వారాలు కాల్ షీట్స్ కూడా ఇచ్చాడట. కమల్ షూటింగ్ పూర్తి అయితే ప్రాజెక్ట్ కే కు గుమ్మడి కాయకొట్టేస్తారట.
500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వర్డల్ మూవీగా ఊహకందని సైన్స్ ఫిక్షన్‌తో ప్రభాస్ కేరీర్‌లోనే చాలా ప్రతిష్టాకత్మంగా తెరకెక్కుతుంది. ఇప్పటీకే ఈ ప్రాజెక్ట్ పై హైప్ పీక్స్‌లో ఉంది. మళ్ళీ కమల్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత పెరిగింది. చిత్ర యూనిట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో మరో కే యాడ్ అయిందని రిసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియోతో చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు తన సినిమాల్లో మాత్రమే నెగిటివ్ రొల్‌లో నటించిన లోకనాయకుడు ఫస్ట్‌టైమ్ విలన్‌గా మారిపోయాడు. కమల్ పై ప్రభాస్ చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. నాగుండెల్లో ఎప్పటికి దాచుకునే బెస్ట్ మెమోరీ కమల్‌హసన్ గారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను… ఈ కలయికలో చాలా నేర్చుకుంటా అంటు ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేయడం కన్‌ఫామ్ అంటున్నారు.