ఛండాలమైన తిట్లు.. అడ్డమైన బూతులు.. వైసీపీలో  టాప్ 10 వీరే..!

ఛండాలమైన తిట్లు.. అడ్డమైన బూతులు.. వైసీపీలో టాప్ 10 వీరే..!

నెంబర్1: కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే

నెంబర్ 2: వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే

నెంబర్3: అంబటి రాంబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే

నెంబర్4: రోజా రెడ్డి, నగరి ఎమ్మెల్యే

నెంబర్5: పేర్ని నాని, మచిలీపట్నం ఎమ్మెల్యే

నెంబర్ 6: జోగి రమేష్, పెడన ఎమ్మెల్యే

నెంబర్7,8: అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే
గుడివాడ అమర్నాద్, అనకాపల్లి ఎమ్మెల్యే

నెంబర్9,10: తమ్మినేని సీతారాం, ఆముదాల వలస ఎమ్మెల్యే
శీదిరి అప్పలరాజు, పలాస ఎమ్మెల్యే

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి.. “ఈ రాజకీయాలు దిగజారిపోతున్నాయి.. విలువలు పతనం అయిపోతున్నాయి” అంటూ మాట్లాడేవారు. ” ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోతోంది.. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చాలంటూ” సంఘ సంస్కర్తలా బిల్డప్ ఇచ్చేవారు. దీంతో జగన్ రెడ్డి మాటలను నమ్మిన ఏపీ ప్రజలు ఆయన బుట్టలో పడ్డారు. నిజంగా ఇతను చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేస్తాడేమో అనే భ్రమలో ఓట్లేసి గెలిపించారు. తీరా.. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గానీ.. వారికి అసలు విషయం బోధపడలేదు.

జగన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు.. తిట్టే బూతులు వినలేక చెవులు మూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకా..? మేం ఓట్లు వేసి గెలిపించింది..? అంటూ.. తమని తాము నిందించుకుంటున్నారు. ఎవరేమనుకున్నా.. మాకేంటి ! అన్న చందంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నిస్సిగ్గుగా చెలరేగి పోతున్నారు. ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా తిట్లు, బూతులతో రెచ్చిపోతున్న టాప్ 10 వైసీపీ నాయకుల వివరాలను ఇప్పుడు చూద్దాం..

జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో తిట్లు, బూతుల కోసం ప్రత్యేకంగా ఏదైనా పోర్టు ఫోలియో అంటూ ఉంటే.. ఆ పోస్టు ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికే దక్కుతుంది. ఎందుకంటే.. సభ్య సమాజం వినలేని, హర్షించలేని తిట్లు, బూతులన్నీ ఈయనగారి నోటివెంట అలవోకగా వచ్చేస్తుంటాయి. ఛండాలమైన మాటలు మాట్లాడటంలో గుడివాడ ఎమ్మెల్యే నానిని మించిన వారు మరెవరూ ఉండరేమో. లారీ క్లీనర్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన ఈయనగారు.. తిట్టే తిట్లు వినలేక జనాలు చెవులు మూసుకుంటూ ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని… ఆయన తనయుడు లోకేష్‌ను కొడాలి నాని అనరాని మాటలు అంటూ ఉంటారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పై సైతం అతను నోరు పారేసుకున్నాడు.

జనం ఛీ అంటారనే ఫీలింగ్ కూడా లేకండా బూతులు మాట్లాడటం ఇతని స్పెషాలిటీ. జగన్ మోహన్ రెడ్డి సహచరుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రలు అడ్డమైన తిట్లూ తిట్టేవారు ఉన్నా.. కొడాలి నానికి సరిపాటి ఎవ్వరూ రారనే చెప్పుకోవచ్చు. ప్రత్యర్ధి పార్టీ నాయకుల వ్యక్తి గత జీవితాలను, వారి కుటుంబాలను సైతం బజారుకీడ్చి తిట్టగల సమర్ధుడు కావటంతో.. కొడాలి నానికి సీఎం జగన్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయంటారు. ఈయన ప్రత్యర్ధులను ఎంతగా తిడితే.. సీఎం జగన్ రెడ్డి అంతగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. గత నాలుగేళ్ళుగా కొడాలి నాని అడ్డమైన వాగుడూ వాగుతున్నా.. సీఎం జగన్ రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి కూడా వారించక పోవటం.. దీనికి బలం చేకూరుస్తోంది.

రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లుతూ.. వారి కుటుంబ సభ్యులను సైతం బాజారుకు ఈడ్చే నేతల్లో కొడాలి నాని తరువాత వల్లభనేని వంశీ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు సీఎం జగన్ రెడ్డి ప్రియశిష్యుడిగా ఉన్నారు. పొరుగునే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నుంచి ఇన్స్ప్రేషన్ పొందారో ఏమోగానీ.. ఈయన కూడా రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలపై బురద జల్లటంలో మాస్టర్స్ డిగ్రీ పొందారని అంటారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వంశీ చేసిన నీచాతి నీచమైన కామెంట్స్.. బాబు గారి కంట కన్నీరు పెట్టించాయంటే.. ఇతగాడి నేచర్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టటంలో సిద్ధహస్తుడిగా వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నాయకులు అభివర్ణిస్తుంటారు.

ఇక.. కొడాలినాని, వల్లభనేని వంశీ తరువాత.. వరస్ట్ గా నోరు పారేసుకునే వైసీపీ నేతల్లో అంబటి రాంబాబు పేరు ప్రముఖంగా చెబుతూ ఉంటారు. సొంత పార్టీ నేతలే ఈయనను అరగంట రాంబాబు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబుకు…. ప్రత్యర్థులను తిట్టటం ద్వారానే మంత్రి పదవి వచ్చిందని అంటారు. అమెరికా నుంచి అమలాపురం వరకు.. ఎవ్వరినీ వదిలిపెట్టకుండా తిట్టగల సమర్ధునిగా అంబటికి గుర్తింపు ఉంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ పై నిరంతరం అవాకులు, చెవాకులు పేలూతూ.. అంబటి ఈ స్థాయికి ఎదిగారని రాజకీయ ప్రత్యర్థులు అంటూ ఉంటారు. తన రాజకీయ ప్రస్థానంలో తిట్ల పురాణంతోనే ఎదిగిన నేతగా.. అంబటి గుర్తింపు పొందారు.

అకాశంలోనే కాదు.. అవకాశాల్లోనూ సగమని మహిళలను అంటూ ఉంటారు. కానీ.. నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ప్రత్యర్థులపై నోరు పారేసుకోవటంలో కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి వారితో పోటీ పడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న రోజా.. రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఎదిగారు. అయితే.. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విపరీతమైన ధ్వేషం పెంచుకున్న ఆమె.. తరచుగా నోటికి పని చెబుతూ ఉంటారు.

అదే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయటానికి సైతం జగన్ రెడ్డి రోజానే ప్రయోగిస్తారనే టాక్ ఉంది. తమ పార్టీ అధినేత ఆశీస్సులు మెండుగా ఉండటంతో.. రోజా తరచుగా రెచ్చిపోతూ ఉంటారు. ఓ మహిళా ప్రజా ప్రతినిధిగా ఉన్నాననే విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉంటారు.

వైసీపీ మంత్రి రోజా తరువాత.. వరస్ట్ గా మాట్లాడే వైసీపీ నేతల జాబితాలో తాజా మాజీ మంత్రి పేర్ని నాని పేరు ప్రముఖంగా చెబుతూ ఉంటారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నాని.. ప్రత్యర్ధి పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తూ ఉంటారు.

ముఖ్యమంత్రి జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఈయన.. ఎంతటి వారినైనా.. ఒరేయ్.. అరేయ్ అంటూ తిడుతూ ఉంటారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను తిట్టటమే పేర్ని నాని దినచర్యలో భాగమని చెబుతారు. పనిలో పనిగా… టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష పై సైతం ఈయన తరచుగా నోరు పారేసుకుంటూ ఉంటారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ధీటుగా.. వైసీపీలో బూతులు తిట్టగల సమర్ధునిగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గుర్తింపు తెచ్చుకున్నారు. సభ్యత, సంస్కారం మరిచి వరస్ట్ గా మాట్లాడటంలో ఈయన కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారని చెబుతారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఉద్దేశించి నిండు సభలో ఈయన మాట్లాడిన “లుచ్చా” భాష విని కోట్లాది మంది తెలుగు వారు.. చెవులు మూసుకోవాల్సి వచ్చింది.

చట్ట సభల్లో సైతం రాజకీయ ప్రత్యర్థులపై ఈ స్థాయిలో బూతులు మాట్లాడిన నాయకులు లేరంటే.. అతిశయోక్తి కాదు. సీఎం జగన్ మెప్పు కోసం ప్రత్యర్థులు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే.. అడ్డమైన తిట్లూ తిట్టగల నాయకునిగా జోగి రమేష్ పేరు పొందారు. ఆ తిట్ల ఫలితంగానే ఆయనకు కేబినెట్‌లో పోస్టు దక్కిందని అంటూ ఉంటారు.

పిట్ట కొంచెం కూత ఘనం.. అన్న చందంగా రాజకీయ అనుభవం అంతగా లేకున్నా.. నోరుపారేసుకునే వైసీపీ నేతల్లో నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్లు చెప్పుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం రాజకీయ ప్రత్యర్థులపై నోరే పారేసుకోవటం వీరి స్పెషాలిటీ.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను నిత్యం ఏదో ఒక మాట అనందే వీరికి పూట గడవదు. అలా ఇష్టం వచ్చినట్టు తిట్టటం వల్లే ఈ ఇద్దరికి జగన్ క్యాబినెట్లో పోస్టులు లభించాయని అంటారు. ఈ మధ్య అనిల్ కుమార్ యాదవ్ కాస్త స్పీడు తగ్గించినా గుడివాడ అమర్నాద్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ క్రమంలో నవ్వులు పాలౌతున్నా ఈ ఇద్దరు నేతలు మాత్రం పట్టించుకోవటం లేదు.

ఇక…. ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం, మంత్రి శీదిరి అప్పలరాజు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై నోరు పారేసుకునే నేతలుగా గుర్తింపు పొందారు. వ్యక్తి గత ధూషణలు చేయటం.. రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డమైన తిట్లు తిట్టటం‌లో స్పెషలిస్టులుగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం పార్టీ నాయకులపై ఈ ఇద్దరు నేతలు తరచుగా నోరు పారేసుకుంటూ ఉంటారు.

తమ మాట వినని అధికారులపై సైతం వీరు తిట్ల పురాణాన్ని అందుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్నప్పటికీ.. తన స్థాయిని మరిచి నోరు పారేసుకుంటారనే అపప్రద మూటగట్టుకున్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ విమర్శల పాలౌతున్నారు.

మొత్తం గా చూస్తే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మంది నేతలు సభ్యత సంస్కారం మరిచి మాట్లాడుతున్నారనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. సీఎం జగన్ రెడ్డి ఆశీస్సులు లేకుండా వీరు ఇలా మాట్లాడతారా..? అంటే కాదని చెప్పటం కష్టం. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ స్థాయిలో దిగజారి మాట్లాడే నేతలు ఇంత వరకు లేరంటే అతిశయోక్తి కాదేమో.

రాజకీయాల్లో విలువల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగన్ రెడ్డి… ముందు తన ఎమ్మెల్యేలు, మంత్రులను కంట్రోల్ పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఇదే విధంగా వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడితే.. వాత పెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *