
టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సెట్లు.. టికెట్లు బుక్ చేసేటప్పుడు జాగ్రత్త..
- News
- July 5, 2023
- No Comment
- 24
కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఖండాంతరాలు దాటి వస్తుంటారు. స్వామి వారి క్షణకాలం దర్శనం కోసం.. భక్తులు పరితపించి పోతుంటారు. కొందరు సిపార్సు లేఖలపై తిరుమలకు చేరుకొని స్వామి వారి దర్శనభాగ్యం పొందుతారు. తిరుమల శ్రీవారి దర్శనం అంటే కోట్లాది మంది భక్తులు చాలా ఉత్సాహం చూపిస్తారు. గతంలో క్యూలైన్లు గంటల కొద్దీ వేచి ఉండి దర్శించుకునేవారు.. కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు.. అన్ని దర్శన టికెట్లు, సేవా టిక్కెట్లను..ఆన్ లైన్ లోనే విక్రయిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్ ఉందో.. అందరికీ తెలిసిందే.. దీంతో పాటు తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువైంది.. భక్తుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని.. కొందరు .. మోసగాళ్లు.. టీటీడీ నకిలీవెబ్ సైట్లు సృష్టించి.. ఆర్జీత సేవలు బుక్కింగ్ చేసుకోవచ్చని.. నమ్మబలికి అమాయకులను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడి.. ప్రతి నిత్యం.. ఎంతో మంది భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రోజూ వందల సంఖ్యలో భక్తులు మోసపోయి.. టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసి తిరిగి వెళ్తున్నారు.
ఏదొక వెబ్ సైట్ లో శ్రీవారి టిక్కెట్లు ఉన్నాయని బుకింగ్ చేస్తే సైబర్ కేటుగాళ్లు వలలో పడినట్లే. ఇలా అవగాహన లేని భక్తులను నకిలీ వెబ్ సైట్ల మయలో పడిపోతున్నారు. టీటీడీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొత్త ఎత్తులు వేస్తూ.. అమాయక భక్తుల ఆశలు అడియాసలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని నకిలీ టికెట్ల కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. నకిలీ వెబ్ సైట్లు.. కేవలం ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా, తమిళనాడు,కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై, కేరళ, వంటి రాష్ట్రాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో.. ఏది “అఫీషియల్” ఏది “నకిలీ” అని గుర్తించలేని గందరగోళ పరిస్థితులు భక్తులలో నెలకొంది. శ్రీవారి దర్శన నకిలీ టికెట్లతో మోసపోయిన ప్రతి భక్తుడూ విజిలెన్స్ పిర్యాదు చేస్తే.. ప్రతి ఒక్క వెబ్ సైట్ పై .. అప్పటికప్పుడు చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. అందుకే.. శ్రీవారి దర్శన టిక్కెట్ల బుకింగ్ లో భక్తులకు అవగాహన ఎంతో కొంతో ఉండాలని టీటీడీ కోరుతోంది.
నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులు శ్రీవారి దర్శన టిక్కెట్లు, వసతి గదులు కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేస్తున్నట్లు.. టీటీడీ అధికారులు గుర్తించారు. టీటీడీ పేరుతో ఉన్నటువంటి 52 నకిలీ వెబ్ సైట్లు, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి భక్తులను అలెర్ట్ చేసింది. భక్తులు .. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసేటప్పుడే.. నకిలీ వెబ్ సైట్ ఏదో .. అసలు వెబ్ సైట్ ఏదో .. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.టీటీడీ మొబైల్ యాప్ టీటీడీ దేవస్థానం ద్వారానే.. టికెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్ల గురించి ఎవరికైనా తెలిస్తే 155257 కాల్ సెంటర్ కు సమాచారం అందించాలని టీటీడీ కోరుతోంది. నకిలీ వెబ్ సైట్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.