తుని రైలు దగ్దం కేసు కొట్టివేత

తుని రైలు దగ్దం కేసు కొట్టివేత

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. కాపు రిజర్వేషన్ల పేరుతో వైసీపీ రగిల్చిన చిచ్చులో.. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్దమైన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో ఆనాడు దహనమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసింది. సరైన సాక్షాధారాలను ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేయని కారణంగా కొట్టేస్తున్నట్టు రైల్వే కోర్టు ప్రకటించింది. ఇదే ఘటనకు సంబంధించి ఆస్తుల ధ్వంసం, దాడుల కేసులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉప సంహరించుకున్న విషయం తెలిసిందే.

తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో 2016 జనవరి 31వ తేదీన కాపు రిజర్వేషన్ కోసం సభ జరిగింది. ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, మంచాల సుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ వంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాల ఫలితంగా.. సభ తరువాత ఆందోళనకారులు రెచ్చిపోయారు. సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టి దగ్దం చేశారు. అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ముందు సరైన సాక్ష్యాధారాలను ఉంచటంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారు.

దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడిన న్యాయమూర్తి… ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. మొత్తం మీద.. తెలుగుదేశం పార్టీని అప్రదిష్ట పాల్చేయటానికి వైసీపీకి అస్త్రంగా మారిన తుని రైలు దగ్దం కేసు..ఇలా ముగిసింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *