జగన్ రెడ్డి పాలన లో 35 శాతం దాటిన నిరుద్యోగ శాతం..!

జగన్ రెడ్డి పాలన లో 35 శాతం దాటిన నిరుద్యోగ శాతం..!

సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీలో నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరకటం గగనం అయిపోయింది. అధికార పార్టీ నేతల అవినీతి, బెదరింపుల వల్ల కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు కూడా మూసివేశారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పట్టభద్రుల నిరుద్యోగిత శాతం రికార్డు స్థాయికి చేరింది. జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాకం పై గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డ చందంగానే వ్యవహరిస్తోందని నిరుద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులకు వేధించటమే పనిగా పెట్టుకున్నారు. 2014 నుంచి 2019 వరకు పెట్టుబడులు రాబట్టడంలో, ఈజ్ ఆఫ్ బిజినెస్ లోదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పట్ట భద్రుల నిరుద్యోగిత 35.1 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వెనుకబడిన రాష్ట్రంగా భావిస్తోన్న రాజస్తాన్ లో పట్టభద్రుల నిరుద్యోగిత 28 శాతం మాత్రమే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే పట్టభద్రుల నిరుద్యోగిత 20 శాతానికే పరిమితం అయింది. 2014- 19 టీడీపీ ప్రభుత్వ పాలనలో పట్టభద్రుల నిరుద్యోగిత 23 శాతం మించలేదు. 2014 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు, చదువుకున్న 78 లక్షల మంది యవతకు స్కిల్ డివలప్‌మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత శాతం కనీస స్థాయికి పరిమితం అయింది.

ప్రస్తుతం ఏటా రాష్ట్రంలో 6.5 లక్షల మంది యువత పట్టభద్రులవుతున్నారు. డిగ్రీ, బీటెక్ ఇలా అనేక కోర్సుల్లో లక్షలాది మంది యువత ఉత్తీర్ణులవుతున్నారు. వారికి ఉపాధి కల్పించే దిశగా సీఎం జగన్ రెడ్డి చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. రాష్ట్రంలో ఇప్పటికే వేలాది మందికి ఉపాధి కల్పిస్తోన్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలపై పగబట్టి పొరుగు రాష్ట్రాలను తరలిపోయేలా చేశారు. దీంతో ఏపీలో నిరుద్యోగిత దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా ఎక్కువగా నమోదైంది. కనీసం పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి కూడా జగన్ రెడ్డి బుద్ది తెచ్చుకోవడం లేదు. ఎవరైనా వంద కోట్లు పెట్టుబడి పెడతారని తెలియగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ వారితో సంప్రదింపులు జరిపి, పెట్టుబడిదారులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్దం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని నాశనం చేశారు. లక్షలాది మంది యవత భవిష్యత్‍ను జగన్ రెడ్డి నాశనం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నా జగన్ రెడ్డికి కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం శోచనీయం.

జగన్ రెడ్డి సీఎం అయ్యాక పట్టుమని వంద మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ ఒక్కటీ రాలేదు. పెట్టుబడులను ఆకర్షించకపోగా, పెట్టుబడిదారులను కమీషన్ల పేరుతో వేధించుకుతిన్నారు. వందలాది పరిశ్రమలు వైసీపీ నేతల వేధింపులు తాళలేక మూతపడ్డాయి. మరికొన్ని పరిశ్రమలు తరలిపోయాయి. ఇవన్నీ గమనిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చే ఉద్దేశం సీఎం జగన్ రెడ్డికి లేదని స్పష్టం అవుతోంది. వైసీపీ నేతలు ఇదే తరహా అరాచకాలను కొనసాగిస్తే రాబోయే కొద్ది రోజుల్లో నిరుద్యోగిత మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారుల సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ ఊదరగొట్టిన వైసీపీ నేతలు గడచిన నాలుగేళ్లలో కనీసం ఒక్క పరిశ్రమనైనా ప్రారంభించారా అంటే సమాధానం మాత్రం చెప్పే పరిస్థితి లేదు. మొత్తం మీద జగన్ రెడ్డి హయాంలో ఏపీలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగి పోవటంతో.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు శ్యక్తం అవుతున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *