రెజ్లర్ల నిర్బంధం పై ‘వరల్డ్‌ రెజ్లింగ్‌’ ఖండన నిషేధిస్తామని హెచ్చరిక

రెజ్లర్ల నిర్బంధం పై ‘వరల్డ్‌ రెజ్లింగ్‌’ ఖండన నిషేధిస్తామని హెచ్చరిక

యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిరచింది. ఎన్నికలు సకాలంలో జరగకపోతే డబ్ల్యుఎఫ్‌ఐని నిషేధిస్తామని హెచ్చరించింది. రెజర్ల డిమాండ్లపై ఇంత జరుగుతున్నా కనీస స్పందన లేకపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మైనర్‌ సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించినందుకు డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఔత్సాహిక రెజ్లింగ్‌ క్రీడకు అంతర్జాతీయ గవర్నింగ్‌ బాడీ యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యుడబ్ల్యు). మంగళవారం జంతర్‌ మంతర్‌లో తమ నిరసన సందర్భంగా భారతదేశపు అగ్రశ్రేణి రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిరచింది. జాతీయ ఫెడరేషన్‌ డబ్ల్యుఎఫ్‌ఐ ఎన్నికలను నిర్ణీత సమయంలో నిర్వహించడంలో విఫలమైతే దానిని సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేసింది. పలువురు మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న నిరసన పై ప్రపంచ సంస్థ దృష్టి పెట్టింది.

‘‘రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు దుర్వినియోగం, వేధింపుల ఆరోపణలపై రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న భారతదేశంలోని పరిస్థితిని చాలా నెలలుగా యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఆందోళనతో పరిశీలిస్తోందని యుడబ్ల్యుడబ్ల్యు ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిని ప్రారంభ దశలోనే పక్కన పెట్టారని, ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా లేరని సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌ సహా ఒలింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతక విజేతలను పోలీసులు ఈడ్చుకెళ్లిన కృార దృశ్యాలు, మహిళా ‘మహాపంచాయత్‌’ కోసం కొత్త పార్లమెంటు భవనం వైపు కవాతు చేస్తున్నప్పుడు రెజ్లర్లు, వారి మద్దతుదారులు భద్రతా వలయాన్ని ఉల్లంఘించినప్పుడు వారిపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి.

గత రెండుమూడు రోజుల్లో జరిగిన సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని నిరసన ప్రదర్శనను ప్రారంభించినందుకు రెజ్లర్లను పోలీసులు అరెస్టు చేసి తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు. వారు ఒక నెలకు పైగా నిరసనలు చేస్తున్న స్థలాన్ని కూడా అధికారులు క్లియర్‌ చేశారు. యుడబ్ల్యుడబ్ల్యు మల్లయోధుల పట్ల ప్రవర్తించడం, నిర్బంధించడాన్ని గట్టిగా ఖండిస్తుందని, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఫలితాలు లేకపోవడం పట్ల ఇది నిరాశను వ్యక్తం చేసింది. ఆరోపణలపై సమగ్రమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని యుడబ్ల్యుడబ్ల్యు సంబంధిత అధికారులను కోరింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *