ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞత సభ ఎందుకు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞత సభ ఎందుకు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతా సభ ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధం కావడంలేదని ఆంధ్రప్రదేశ్‌ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అద్యక్షుడు ఉప్పుటూరి బాలగురుస్వామి ప్రశ్నించారు.

శుక్రవారం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చినందుకా? టి. టి. డి. బోర్డు మెంబర్షిప్‌ ఇచ్చినందుకా? 45 సంవత్సరాలకు పెన్షన్‌ ఇచ్చినందుకా? రాష్ట్రంలో 2 లక్షల వరకు సెలూన్స్‌ ఉంటే అరాకొరా షాపులకు కరెంట్‌ ఇచ్చినందుకా? 15 నుండి 20శాతం చేదోడు పథకము ఇచ్చినందుకా? కార్పోరేషన్‌ కు నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపినందుకా? గత పాలకవర్గములో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, ద్వారకా తిరుమల ఆలయంలో బోర్డు మెంబర్ను తొలగించినందుకా? దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించినందుకా? కనీస వేతనం రూ. 20, 000 చేస్తున్నామని చెప్పి, లోపభూయిష్టంగా జిఓ. ఇచ్చినందుకా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇచ్చిన జి. ఓ. లో ఇ. ఓ. కనుసన్నలలో మా వాళ్ళచేత వెట్టిచాకిరీ చేయించడానికా? వంశపారంపర్యంగా చేస్తున్న దేవాలయాలలో 65 సంవత్సరములకే రిటైర్‌ అయినవారి స్థానంలో వారి కుటుంబానికి స్థానం కల్పించినందుకా? ఏ క్షురకుడైనా చనిపోతే, లేదా ఆరోగ్యం సహకరించకపోతే అతని కుటుంబ సభ్యులలో ఒకరికి ఆ ఉద్యోగమును ఇచ్చేదీ లేనిదీ తెలుపనందుకా? మీకు పదవులిచ్చి, జీతాలు ఇస్తున్నందుకు కార్పోరేషన్‌ లో ఉండే వారు కులానికి సేవచేసే విధంగా పనిచేయండని, ఇకనైనా ప్రభుత్వానికి మీ భజన మానుకుని ఇచ్చిన హామీలు అమలు జరిపేందుకు కృషిచేయాలని డిమాండ్‌ చేస్తున్నానని ఆయన తెలిపారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *