అఖిల్ తో  ఐటెమ్ సాంగ్‌లో ఊర్వ‌శీ రౌతేలా…

అఖిల్ తో ఐటెమ్ సాంగ్‌లో ఊర్వ‌శీ రౌతేలా…

వేర్ ఈజ్ ది పార్టీ అంటూ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య‌లో చిందేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా అందం తో పటు ఎక్సపోసింగ్ కూడా అమ్మడు లిమిట్స్ పెట్టదు సో మన తెలుగువాళ్లు కళాపోసకులే కావటం తో మ్మాడు మ‌రో ఐటెమ్ సాంగ్‌లో ఆడి పాడ‌నుంద‌ట …

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా సౌత్ కి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాల‌ను ఎక్కువ‌గా చేస్తుంది. గ‌త ఏడాది త‌మిళంలో శ‌ర‌వ‌ణ‌న్ లెజెండ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అస‌లు హీరోయిన్స్ ఎవ్వరు న‌టించ‌కూడ‌ద‌ని అనుకున్న., శ‌ర‌వ‌ణ‌న్ ప‌క్క‌న న‌టించ‌టానికి గ‌ట్టిగానే ఈ అమ్మ‌డు వ‌సూలు చేసింది. అక్క‌డ నుంచి టాలీవుడ్ వైపు ట‌ర్న్ తిప్పేసింది. తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం వాల్తేరు వీర‌య్య‌లో ఐటెమ్ సాంగ్‌లో బాసూ తో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ చిందులేసి ఆడియెన్స్‌ను అల‌రించింది. ఆ మ‌ధ్య‌లో కాంతార 2లో ఈమె న‌టించ‌బోతుందంటూ వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఊర్వ‌శీ రౌతేలా మ‌రోసారి ఐటెమ్ భామ‌గా టాలీవుడ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి రెడీ అయిపోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న హాట్ టాపిక్‌. అక్కినేని న‌ట వార‌సుడు అఖిల్ లేటెస్ట్ స్పై థ్రిల్ల‌ర్ ఏజెంట్. ఇది పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఓ పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ దాదాపుపూర్త‌య్యింది. ఈ ఐటెమ్ సాంగ్‌లో ఎవ‌రైతే బావుంటారా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెగ ఆలోచించారు. చివ‌ర‌కు ఊర్వ‌శీ రౌతేలాకు ఓటేశార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే భారీ సెట్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.

మ‌రి హిప్ హాప్ త‌మిళ ఈ హాట్ బ్యూటీ న‌టిస్తోన్న ఐటెమ్ సాంగ్ త‌న ట్యూన్‌తో ఎలా ఘాటెక్కిస్తారో చూడాలి మ‌రి. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతోన్న ఏజెంట్‌లో ఢిల్లీ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాత‌గా ఉంటూ అనీల్ సుంక‌ర బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చేసి సిక్స్ ప్యాక్‌లో క‌నిపిస్తున్నారు. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *