సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తాం  వాల్మీకి లకు నారా లోకేష్ హామీ

సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తాం వాల్మీకి లకు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం గంజహళ్లిలోవాల్మీకి, బోయ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

మండల కేంద్రమైన గోనెగండ్లలో వాల్మీకులకు కమ్యూనిటి హాలు నిర్మించాలి. వాల్మీకులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి.

వాల్మీకుల జీవనానికి ఎటువంటి కుల, చేతి వృత్తి లేదు. మా జీవనోపాధికి స్వయం ఉపాధి రుణాలిప్పించి ఆదుకోవాలి.

వాల్మీకి కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించాలి. నిరుపేద వాల్మీకులకు భూ వసతి కల్పించాలి.

గోనెగండ్లలో వాల్మీకి ఆలయం ఒక ఎకరా విస్తీర్ణములో ఉన్నది. ఈ ఆలయానికి ప్రహారిగోడను నిర్మించి, అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.

పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే వాల్మీకులపై బనాయించిన తప్పుడు కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే
విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసంబద్ధమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించింది.

గోనెగుండ్లలో కమ్యూనిటీ హాలు నిర్మించి, శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాం.

గోనెగుండ్లలో వాల్మీకిల ఆలయానికి ప్రహరీగోడ నిర్మించి రక్షణ కల్పిస్తాం.

వాల్మీకిలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *