లాబీయిస్ట్ తో సమావేశం ఎవరి భవిష్యత్ కోసం?  సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్

లాబీయిస్ట్ తో సమావేశం ఎవరి భవిష్యత్ కోసం? సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్

వివేకా కేసు దర్యాప్తు అధికారులు అప్రమత్తంగా వుండాలి
న్యాయవ్యవస్థ, సిబిఐలు మీరనుకున్నట్టు దిగజారలేదు
ఇలాంటి పనులు చేసేందుకా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది?
వివేకా హత్యను రాజకీయ లబ్దికోసం వాడుకున్నారు
విలేకరుల సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
……..
లాబీయిస్ట్ విజయ్ కుమార్ తో ఏం మాట్లాడింది, ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు బహిర్గతం చేయాలి అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. లాబీయిస్ట్ విజయ్ కుమార్, అతన్ని నడిపిస్తున్న అవినీతి, అధికార ప్రతిరూపాలైన పెద్దల ఉచ్చులో పడకుండా వివేకా హత్యకేసు విచారణలోని పెద్దలు, ప్రముఖులు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన కోరారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు. ఈ వ్యవహారంలో లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఇప్పుడేం చేయబోతున్నారు? జగన్ తరుపున వివేకా హత్యకేసు వ్యవహారంలో తలదూర్చిన లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఏక్షణంలో ఎవరినైనా కలవొచ్చు.

హత్యకేసు విచారణలో భాగస్వాములైన అధికారుల్ని, వారిపై అధికారుల్ని కలవొచ్చు. వారంతా విజయ్ కుమార్ లాంటి వారిని దరిచేరనీయకుండా, వివేకాహత్య కేసు విచారణ సక్రమంగా పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వర్ల రామయ్య కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన శశిధర్ తండ్రికే ద్రోహం చేసిన దుర్మార్గుడు. ఉచ్ఛనీచాలు తెలియనివాడు, ఏదిమంచో ఏదిచెడో తెలియని మనిషి. అలాంటి వారంతా కలిసి జగన్మోహన్ రెడ్డి కార్యాన్ని చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు అని ఆరోపించారు. అన్నీదారులు మూసుకుపోయాక లాబీయిస్ట్ లను రంగంలోకి దించినా ఉపయోగం లేదని భారతదేశ న్యాయవ్యవస్థ, దర్యాప్తుసంస్థ సీబీఐ ఇంకా తాను అనుకునే స్థితికి దిగజారలేదని ముఖ్యమంత్రి గ్రహించాలని కోరారు.

జగన్ కు దేవుడిచ్చిన అన్నయ్య అయిన గాలిజనార్థన్ రెడ్డి గతంలో బెయిల్ పొందడానికి సీబీఐ జడ్జికి రూ.100కోట్ల లంచం ఇచ్చి పట్టుబడ్డాడు. ఆ వ్యవహారంలో సీబీఐ జడ్జి పట్టాభిరామారావు బలయ్యారు. అదే కోవలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ ద్వారా ఎవరిని బలిచేయబో తున్నాడు అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేయడానికేనా జగన్మోహన్ రెడ్డిని, ఆయనపార్టీని గెలిపించి ప్రజలు ముఖ్యమంత్రిని చేసింది? విజయ్ కుమార్ ఎవరో, తనఇంటికి వచ్చి ఏం మాట్లాడారో ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు చెప్పాలి. విజయ్ కుమార్ కు ముఖ్యమంత్రి ఏంపని అప్పగించారు.. ఎవరిని మేనేజ్ చేయమని చెప్పారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డితీరు, ఆలోచనావిధానం ఎలాఉంటుందో ఇప్పటికైనా ప్రజలుఆలోచించాలి. లాబీయిస్ట్ లతో తానెందుకు సమావేశమైంది ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టకపోతే, హంతకుల్ని కాపాడటానికే ఆయన పదవిలో ఉన్నారని ప్రజానీకం భావించాల్సి వస్తుందని ఆయనన్నారు.

వివేకాహత్యజరిగిన రోజురాత్రి అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి ఫోన్ చేసి, జగన్ తో, ఆయన సతీమణి భారతిరెడ్డి అటెండర్ కి ఫోన్ చేసి ఆమెతో ఏం మాట్లాడారనేది కూడా తేలాలి. త్వరలోనే ఈ కేసులో ముఖ్య మంత్రి దంపతులకు కూడా సీబీఐ నోటీసులువస్తాయని ఆయన చెప్పారు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడటానికి ముఖ్యమంత్రి ఎన్నో సార్లు ఢిల్లీకివెళ్లాడు, బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే, ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వెళ్లాడు. అర్థరాత్రి, అపరాత్రి అనిలేకుండా ప్రత్యేకవిమానాల్లో పరుగులు తీశాడు. ఎన్ని చేసినా, ఎంతచేసినా భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ల అరెస్ట్ ను ముఖ్యమంత్రి ఆపలేడని తాము ఇదివరకే చెప్పినట్టే జరిగింది. ప్రజలందరి చూపు ఇప్పుడు తాడేపల్లి రాజప్రాసాదం వైపే ఉందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యలు ఆయనకే చేటుచేయబోతున్నాయి. చట్టం తనపనితాను చేసుకుపోతుంది అని మంత్రి అన్నవెంటనే, సజ్జల స్పందించాడు. దానివల్లే రేపోమాపో సురేశ్ మంత్రి పదవి ఊడనుందని రామయ్య స్పష్టంచేశారు.

వివేకాహత్యకేసులో వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి రిమాండ్ కు వెళ్తారని ముఖ్యమంత్రికి ముందే తెలుసు. ఎందుకంటే తనబాబా య్ వివేకానందరెడ్డిని చంపిన ఘటనలో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలే ప్రధాన సూత్రధారులు. లేకపోతే హత్యజరిగినరోజు అర్థరాత్రి అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, జగన్ తో ఏం మాట్లాడాడు? భారతిరెడ్డి అటెండర్ నవీన్ కి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఏం మాట్లాడారు? వివేకాహత్యను తన రాజకీయలబ్ధికి వాడుకొని ప్రజల్ని ఏమార్చి, సానుభూతితో జగన్ లబ్ధిపొందాడు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? సానుభూతి కోసం, రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి ఏమైనా చేస్తాడు అని వర్ల రామయ్య చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోయారు. మరోబాబాయ్ భాస్కర్ రెడ్డి, ఇది వరకు జగన్ ఉన్న చంచల్ గూడజైల్లో ఉన్నారు. వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్. అవినాశ్ రెడ్డిల ను రక్షించడానికి, వారు అరెస్ట్ కాకుండా చూడటానికే జగన్ తలకిందులుగా తపస్సు చేసి, భగీరథప్రయత్నాలు చేశారు. చట్టం చాలా బలమైనది. దాని పని అదిచేస్తుంది. తన తమ్ము డు,బాబాయ్ కోర్టులో నిర్దోషులుగా బయటకు వస్తారని జగన్ భావించలేదు. ఢిల్లీ యాత్రలతో ఫలం దక్కలేదని భావించిన జగన్ చివరకు, తనవాళ్లను రక్షించుకోవడానికి దిగ్రేట్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారు అని వర్ల రామయ్య వివరించారు.

వాస్తుశాస్త్రం, హస్తసాముద్రికంలో నిష్ణాతుడైన విజయ్ కుమార్ కు కొంతమంది పెద్దలతో పరి చయాలున్నాయి. ఢిల్లీ, ఇతరరాష్ట్రాల్లోని పెద్ద పెద్ద తలకాయల తో తనకున్న పరిచయాలతో వి జయ్ కుమార్ లాబీయింగ్ చేస్తుంటారని, రాజీలు చేస్తారని, తిమ్మినిబమ్మిని బమ్మిని తిమ్మి ని చేస్తారని చెప్పుకుంటున్నారు. అలాంటి సీఎం విజయ్ కుమార్ నిన్నఉదయం 10.30 నిమిషాలకి, మైసూర్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీ.శశిధర్ (ఆంధ్రాకుచెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కుమారుడు) హెచ్.పీ.బసవరాజు, సతీశ్ లతో కలిసి గన్నవరం విమానాశ్ర యానికి వచ్చారు. వారు11.40కి విమానాశ్రయానికి వచ్చే టప్పటికి వారి కోసం ప్రత్యేకంగా ఒకకారు సిద్ధంగా ఉంది. ఆకారుతో పాటు మరోపోలీస్ పైలట్ వాహనంకూడా సిద్ధంగా ఉంది.

విమానాశ్రయానికి వచ్చాక వారికోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేకకారులో లాబీయిస్ట్ విజయ్ కుమార్, శశిధర్ లు మాత్ర మే తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. వారు ముఖ్యమంత్రి ఇంటికివెళ్లిన కారునంబర్ కూడా సక్రమంగా కనీకనిపించకుండా ఉందని చెప్పారు. ఆ కారు ఆఘమేఘాలమీద ముఖ్యమంత్రి నివాసానికి చేరింది. వారు నేరుగా ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లిపోయి, సాయంత్రం 5.30నిమిషాలవరకు అక్కడేఉన్నారు. అక్కడే భోజనంకూడా చేశారు. సాయంత్రం 5.30నిమిషాలతర్వాత ఆ ఇద్దరూ ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. అక్కడనుంచి వారువచ్చిన ప్రత్యేక విమానంలో తిరిగి రాత్రి 7.00గంటలకు హైదరాబాద్ వెళ్లిపోయారు. మైసూర్ నుంచి వచ్చినవారు అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ వెళ్లడమేంటి? విజయ్ కుమార్, శశిధర్ లతో ముఖ్యమంత్రి సమావేశమైన సమయంలో ఏ అధికారి, మంత్రికూడా లోనికి వెళ్లింది లేదు. (కావాలంటే రికార్డులు చెక్ చేసుకోండి) అని వర్ల రామయ్య వివరించారు.

విజయ్ కుమార్, శశిధర్ లు ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారు. వారు ముఖ్యమంత్రిని ఏంకోరికలు కోరారో తెలియాలి. తనబాబాయ్, తన తమ్ముడు రిమాండ్ కువెళ్లకుండా చూడాలని, రిమాండ్ కు వెళ్తే ఏదోరకంగా బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ తో చెప్పారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశానంతరం మరలా విజయ్ కుమార్, శశిధర్ లు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేకవిమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. మైసూర్ నుంచి వచ్చినవారు, తిరిగి అక్కడికి వెళ్లకుండా, హైదరాబాద్ లో దిగి తమకార్యాచరణ మొదలెట్టారు. విజయ్ కుమార్ బృహత్తర కార్యక్రమం వై.ఎస్.భాస్కర్ రెడ్డిని బయటకు తీసుకురావడమే. వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలను రక్షించడానికే జగన్మోహన్ రెడ్డి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారు అని వర్ల రామయ్య చెప్పారు. కాదని ముఖ్యమంత్రి చెప్పగలరా? ముఖ్యమంత్రి లాబీయిస్ట్ విజయ్ కుమార్ తో సమావేశమైంది రాష్ట్ర భవిష్యత్ కోసమా? లేక ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసమా? అని ఆయన ప్రశ్నించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *