గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాం : నారా లోకేష్ హామీ

గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాం : నారా లోకేష్ హామీ

గ్రామీణాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం పాణ్యం నియోజకవర్గం పెద్దకొట్టాల
గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. మాగ్రామ రైతులు నకిలీ పత్తివిత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయండి.

గ్రామంలో ముస్లిం శ్మశాన వాటికను అభివృద్ధి చేయండి.

ఊరిమధ్యలో ఎండిపోయిన బావి కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

పెద్దకొట్టాలలో శిథిలావస్థకు చేరిన స్కూలు స్థానంలో కొత్తది నిర్మించండి.

గ్రామంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో నకిలీ విత్తనాల మాఫియా కారణంగా లక్షలాది రైతులు తీవ్రంగా నష్టపోయారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.

నకిలీవిత్తనాలతో రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలనుంచి నష్టపరిహారాన్ని ఇప్పిస్తాం.

పెదకొట్టాల గ్రామంలో ముస్లిం శ్మశాన వాటిక, స్కూలు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం అని లోకేష్ హామీ
ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *