
కిడ్నాప్ తో భయపడి విశాఖ వదిలి వెళ్లిపోతున్న వైసీపీ ఎంపీ
- Ap political StoryNewsPolitics
- June 21, 2023
- No Comment
- 21
ఏపీలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది. ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేదు. సామాన్యులే కాదు ప్రజాప్రతినిథులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును దారుణంగా కొట్టారు. ఇప్పుడు విశాఖలో మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఏకంగా రౌడీషీటర్లు కిడ్నాప్ చేశారు. ఇక, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులైతే లెక్కేలేదు. అంతటి భయానక పరిస్థితులు నెలకొన్న వేళ, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖను వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. కుటుంబ సభ్యుల కిడ్నాప్ తో భయపడిపోయిన ఎంపీ తెలంగాణకు మకాం మారుస్తున్నారు. ఇకపై వ్యాపారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా చేయనున్నట్లు ప్రకటించారు.
ఏపీలో ఉండలేక ఏకంగా వైసీపీ ప్రజాప్రతినిథులే పక్క రాష్ట్రాల వైపు చూసే పరిస్థితులు నెలకొన్నాయంటే… రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. దోపిడీలు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ఈ అరాచక పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీనే కాపాడలేని ముఖ్యమంత్రి, ఇక రాష్ట్రాన్నేం కాపాడుతాడని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇప్పటికే అధికార పార్టీ నేతల బెదిరింపులతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఉన్న పరిశ్రమలే రాష్ట్రం నుంచి తరలిపోతున్న దుస్థితి. ఇప్పుడు వైసీపీ ఎంపీ కూడా.. ఏపీలో వ్యాపారం చేసే పరిస్థితి లేదంటూ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నారు. ముఖ్యమంత్రి పరిపాలన రాజధాని గా ప్రకటించిన విశాఖ నుంచి సొంత పార్టీ ఎంపీనే వెళ్లిపోతానంటుంటే…ఇక ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది. జగన్ పాలనలో అరాచక శక్తులు ఏవిధంగా రాజ్యమేలుతున్నాయో ఎంపీ కుటుంబం కిడ్నాప్ కథా చిత్రం కళ్లకు కడుతోంది.