రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో నడుద్దాం: టిడిపి

రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లో నడుద్దాం: టిడిపి

భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్వాప్నికుడు, భారతరత్న డా. బి. ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్ర పటాలకు, విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అంబేద్కర్‌ జాతికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని, రాష్ట్రంలో అంబేద్కర్‌ రాసిన రాజ్యంగం అమలు కావాలని ఆకాంక్షించారు.

కళ్యాణదుర్గంలో..

కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, సీనియర్‌ నాయకుడు చౌళం మల్లికార్జున, యువ నాయకుడు డాక్టర్‌ ఉన్నం మారుతి చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ ఆర్జీ శివశంకర్‌, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పాపంపల్లి రామాంజనేయులు, మాజీ కురుబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డీకే రామాంజనేయులు, మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ళ వెంకటేశులు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వైపీ రమేష్‌, మాజీ ఎంపీపీ రాయల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గౌని శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్‌ గోవిందరెడ్డి, హరికృష్ణ, డీఎన్‌ మూర్తి, గడ్డం రామాంజనేయులు, మల్లిపల్లి నారాయణ, అన్వర్‌, సాయినాథ్‌, ఊటంకి రామాంజనేయులు, శ్రీధర్‌, ఇటుకల రామాంజనేయులు, పాలబండ్ల రామన్న, దాసరి గోపి, ఆర్కే రాజు, గోళ్ళ రాము, బోర్ల గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పెనుకొండలో…

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ 132వ జయంతిని ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘ నాయకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పత్తికొండలో…

పత్తికొండ నియోజకవర్గం రెవిన్యూ డివిజనల్‌ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ కె. ఇ. శ్యాంబాబు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ నాయకులు ఉచ్చూరప్ప, సోమ్ల నాయక్‌, లోకనాథ్‌, పెద్దహుల్తి మాజీ సర్పంచ్‌ తిప్పన్న, బి. టి గోవిందు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

నందిగామలో…

నందిగామ పట్టణం గాంధీ సెంటర్‌లో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌. బి. ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా టిడిపి ఎస్సీ నేతలు, పట్టణ తెదేపా కౌన్సిలర్లు, తెదేపా నేతలు, కార్యకర్తలతో కలసి టీడీపీ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య డాక్టర్‌. బి. ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు.

మాడుగులలో…

మాడుగుల అంబేద్కర్‌ కాలనీ వద్ద డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 132 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ జి కుమార్‌ పాల్గొని. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బాల్యంలోనే అడుగు అడుగున బాధలకు, అవమానాలకు గురై బీదరీకాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయ ప్రతిభతో భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహోన్నత వ్యక్తి శ్రీ డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు.

ఈయన అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతగానో శ్రమించారు. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ అని అన్నారు. భారతదేశాన్ని లౌకిక, గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగ తీర్చిదిద్దెందుకు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అనుచరించిన కార్యశరణ మహోన్నతమైందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆధునిక భారతదేశ కోసం అలుపెరిగిని పోరాటం చేసిన ఆర్థికవేత్త, రాజకీయవేత్త, భారతరత్న డా. బిఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక ఈయన మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారన్నారు.

భీమవరంలో…

భీమవరం తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి కార్యక్రమాన్ని భీమవరం టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్‌ తోట సీతారామలక్ష్మి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నిరుపేద కుటుంబంలో పుట్టి తన ప్రజ్ఞా మేదస్సుతో స్వయం కృషితో అత్యుత్తమ స్థానాన్ని అలంకరించిన మానవతావాదని అని వారి సేవలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, మెరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాద్‌, ఎద్దు ఏసుపాదం, మైలాబత్తుల ఐజాక్‌ బాబు, చల్లబోయిన సుబ్బారావు, యాళ్ళ వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

అంగళ్ళులో..

భారత రత్న డాక్టర్‌ బి అర్‌ అంబేద్కర్‌ స్పూర్తితో ప్రజా సేవకు అంకితమవు తామని టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సురేంద్ర యాదవ్‌ అన్నారు. శుక్రవారం కురబల కోట మండలం అంగళ్ళు టీడీపీ కార్యాలయం లో 132 వ అంబేద్కర్‌ జయంతి ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రత్న డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆ మహ నీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, సమాజం లోని అసమానతలను తొలగించేలా, చట్టాలను రాజ్యాంగంలో పొందు పరిచిన మహా మేధావి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని పేర్కొన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *