విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతాం : నారా లోకేష్ హామీ

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతాం : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే విభిన్నప్రతిభావంతుల సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు తాలూకా విభిన్న ప్రతిభావంతుల హక్కులు, రిజర్వేషన్ల సాధన సమితి ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విభిన్న ప్రతిభావంతులకు న్యాయబద్దంగా, చట్టబద్దంగా రావాల్సిన హక్కులు లేవు.

విభిన్నప్రతిభావంతుల సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేయాలి. ప్రతిజిల్లాలో విభిన్న ప్రతిభావంతుల హోం నిర్మించాలి. విభిన్న ప్రతిభావంతులకు ఎటువంటి షరతులు లేకుండా రూ.6వేల పెన్షన్ ఇవ్వాలి. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ కు రూ.5వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి. విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం-2016ను పటిష్టంగా అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులను, కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయాలి.

విభిన్న ప్రతిభావంతులకు మ్యారేజి ఇన్సెంటివ్ గా రూ.3లక్షల రూపాయలు ఇవ్వాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా  స్పందించారు. జగన్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులపై కనీసం సానుభూతి లేకుండా వ్యవహరిస్తోంది. సదరం సర్టిఫికెట్‌ ఉండి, పించన్‌ రానివారు లక్షల్లో ఉన్నారు. అర్హులైన అనేకమందికి వైసిపి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.

2016 విభిన్న ప్రతిభావంతులు, హక్కులు, పరరక్షణ చట్టం ప్రకారం 21రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకొని సర్టిఫికెట్ల ఇచ్చి పెన్షన్లు అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేస్తాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం జిల్లాకలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తాం. దివ్యాంగులకు స్వయం ఉపాధి పెంపొందించేలా కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేస్తాం.

విభిన్న ప్రతిభావంతులు గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చర్యలు తీసుకుంటాం. వివిధ రంగాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలను మంజూరుచేసేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *